Praja Darbar:ప్రజా దర్బార్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల్లోనే 5 వేలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీని కోసం ప్రజా భవన్ లో ఒక ప్రత్యే విభాగాన్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. By Manogna alamuru 11 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి మూడురోజుల కిందట మొదలైన ప్రజా దర్బార్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. రోజూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ప్రజాదర్బార్ కు క్యూలు కడుతున్నారు. మూడు రోజుల్లో 5 వేల 400 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో ఫ్రారంభించిన మొదటి రోజే 3 వేల 900 వందల ఫిర్యాదులు స్వీకరించారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించేందుకు ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాంతో పాటూ ప్రతీ ఫిర్యాదులను ఆన్ లైన్ చేసి రశీదు ఇచ్చేందుకు వీలుగా ఒక పోర్టల్ ను కూడా స్టార్ట్ చేశారు. Also Read:రాజకీయాలొద్దు..డీకే భారీ ఆఫర్ ను తిరస్కరించిన కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రజా దర్బార్ లు ఫిర్యాదుల నమోదు పక్కా ప్లాన్డ్ గా నడుస్తోంది. ఆన్ లైన్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు అయిన వెంటనే అర్జీదారుడి మొబైల్ కు మెసేజ్ వస్తుంది. అందులో ఫిర్యాదు స్వీకరించినట్టు ఎక్నాలెడ్జ్ మెంట్ ను పంపిస్తారు. అయితే ప్రస్తుతానికి ప్రజా దర్బార్ ను ఎవరు అందుబాటులో ఉంటే వారు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఇంకా విధివిధానాలు మాత్రం ఫైనలైజ్ అవ్వలేదు. ఇక ఫిర్యాదుల్లో అధికశాతం గృహాలు, భూములకు సంబంధించినవే ఉంటున్నాయని తెలుస్తోంది. రెండో రోజు వచ్చిన అర్జీల్లో 459 ఇళ్ళకు సంబంధించినవే ఉన్నాయి. 300కు పైగా రెవెన్యూకు సంబంధించిన ఫిర్యాదులున్నాయి. పింఛన్లకు సంబంధించినవి 60, ఉద్యోగాల అర్జీలు 140...వైద్య, ఆరోగ్య సంబంధిత ఫిర్యాదులు ఏడు నమోదయినట్లు సమాచారం. Also Read:అన్నా అని పిలిచింది..నేనున్నా అంటూ ఆపన్న హస్తం ఇచ్చిన రేవంత్ #telanagana #praja-bhavan #praja-darbar #complaints మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి