Train accident: ట్రైన్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ట్రైన్‌ చైన్‌ లాగి పరుగులు తీశారు. అనంతరం ఘటనా స్ధలికి చేరుకున్న రైల్వే అధికారులు.. బ్రేక్‌ లైనర్ల వల్ల పొగలు వ్యాపించినట్లు స్పష్టం చేశారు.

New Update
Train accident: ట్రైన్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

ప్రయాణికులు రైల్లో ప్రయాణం చేయాలంటేనే భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదాన్ని ప్రతీ ఒక్కరూ గర్తుంచుకునే ఉంటారు. అంతే కాకుండా ఇటీవల రైల్లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతోపాటు పలు ప్రాంతాల్లో రైలు బోగీల కింద మంటలు చెలరేగడంతో రైల్వే ప్రయాణికుల భయం అంతా ఇంతా కాదు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల పరిధిలోని మడుగు రైల్వేస్టేషన్‌ సమీపంలో హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగలు వస్తుండంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ట్రైన్‌ చైన్‌ లాగి రైలు నుంచి పరుగులు పెట్టారు.

దీంతో ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది బ్రేక్‌ లైనర్స్‌ పట్టివేయడంతో పొగలు వ్యాపించినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. మరమ్మతు పనులు చేపట్టిన అధికారులు రైలును అరగంట ఆపి అనంతరం రైలు ప్రయాణికులతో బయలు దేరింది. కాగా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట రైలు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సామాన్యులు మాత్రం తప్పని పరిస్థితుల్లో రైలు ఎక్కే పరిస్థితి నెలకొంది.

గతంలో బస్సు ప్రయాణాల కంటే రైలు ప్రయాణాలే 100 శాతం సేఫ్‌ అని ప్రయాణికుల్లో బలమైన నమ్మకం ఉండేంది. అంతే కాకుండా ప్రయాణికులు తాము బుక్‌ చేసుకున్న టికెట్‌ను తిరిగి క్యాన్సిల్‌ చేసుకుంటే డబ్బులు వస్తాయనే భరోసా కూడా ఉండటంతో అధిక శాతం మంది రైల్వే ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల వల్ల ప్రయాణికులు రైల్వే జర్నీ చేయాలంటేనే భయపడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. రైలుకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు