Bear Sleep: ఎలుగుబంటిలా నిద్రపోతున్నారా? సైంటిస్టుల షాకింగ్ హెచ్చరిక! మనుషులు ఎలుగుబంటిలా నిద్రపోతే కండరాలు క్షీణిస్తాయి. ఎముకలు బలహీనపడతాయి. చర్మంపై పుండ్లు ఏర్పడతాయి. హృదయ స్పందన రేటు తగ్గుతుంది. వెన్నుముక గాయాలతో ఉన్న రోగులపై చేసిన పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. By Vijaya Nimma 29 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Bear Sleep: ఎలుగుబంట్లు నిద్ర గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. చలికాలంలో ఎలుగుబంట్లు సుదీర్ఘ నిద్రలో ఉంటాయి. దీన్ని హైబర్నేషన్ అని కూడా అంటారు. ఈ టైంలో కొద్ది ఎనర్జీని వాడి ఈ హైబర్నేటర్స్.. అనేక వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకుంటాయి. అయితే.. సుదీర్ఘ చలికాలపు నిద్రలో అవి చనిపోకుండా ఎలా సర్వైవ్ అవుతున్నాయని దానిపై పరిశోధనలు చేశారు. ఈ ఎలుగుబంట్ల మాదిరిగా నిద్రపోతే.. మనుషులు హెల్తీగా ఉంటారా..? లేక చనిపోతారా..? అనే విషయాన్ని నిపుణులు గుర్తించారు. ఇప్పుడు దానిపై కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలుగుబంట్లపై సర్వే.. నిజానికి దాదాపు ఎనిమిది నెలల వరకు ఎలుగుబంట్లు నిద్రాణస్థితిలో ఉంటాయి. అలా మనుషులు పడుకుంటే.. కండరాలు క్షీణిస్తాయి, చర్మంపై పుండ్లు ఏర్పడతాయి, ఎముకలు బలహీనపడతాయి. హృదయ స్పందన రేటు తగ్గుతుంది. కానీ.. ఈ పరిస్థితినే ఎలుగుబంట్లలో మాదిరిగా ఆరోగ్యంగా ఎలా మార్చొచ్చు అనే విషయాన్ని గుర్తించేందుకు కొన్ని ఎలుగుబంట్లపై సర్వే చేశారు. తరువాత వాటి రక్తాన్ని సేకరించారు. ఈ క్రమంలో కొన్ని ప్రోటీన్ల ఆవిష్కరణకు దారితీసిందని చేసిన పరిశోధనలో వెల్లడైంది. వెన్నుముక గాయాలతో ఉన్న రోగులపై పరిశోధన ముఖ్యంగా HSP47 అని పిలువబడే ప్రోటీన్ వేసవితో పోలిస్తే చలికాలంలో ఎలుగుబంటి రక్తంలో చాలా తక్కువగా ఉందని గుర్తించారు. ప్లేట్లెట్స్ ఉపరితలంపై కనిపించే ఈ ప్రోటీన్..రక్తకణాలు ఒకదానితో ఒకటి అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. గాయం తర్వాత రక్తస్రావం కాకుండా ఆపుతాయి. ఈ ప్రోటీన్ ప్రభావం మానవుల్లో అలాగే ఉందా..? లేదా..? నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు..వెన్నుముక గాయాలతో ఉన్న మనుషులను ఆశ్రయించారు. నిద్రాణస్థితిలో ఉన్న ఎలుగుబంట్ల మాదిరిగానే ఈ రోగులు కూడా బ్లడ్ క్లాట్స్‌ను పొందారని.. వారి శరీరాలు గాయం తర్వాత HSP47 ప్రోటీన్ ఉనికిని తగ్గించడానికి ఓ మార్గాన్ని కనుగొన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కూడా చదవండి: కుక్క తోక ఎప్పుడూ వంకరేనా..? అది నిటారుగా ఎందుకు ఉండదు..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #scientists #bear-sleep #health-benefits #warning మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి