Health benefits: అల్పాహారం మానేస్తున్నారా..? జరిగే పరిణామాలు ఇవే.!!

కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై అందరూ శ్రద్ధ ఎక్కువగా పెట్టారు. అయితే..ఉపవాసాలంటూ చాలామంది అల్పాహారాన్ని మానేస్తుంటారు. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలతో పాటు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Health benefits: అల్పాహారం మానేస్తున్నారా..? జరిగే పరిణామాలు ఇవే.!!

Health benefits: ప్రస్తుత కాలాంలో చాలామంది ఉదయం పూట అల్పాహారం తినడం మానేస్తున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ తోపాటు గుండె జబ్బుల ముప్పు ఉంటుందని ఓ అధ్యయనంలో వెళ్లడైంది. ఈ మధ్యకాలంలో రోజురోజుకు ఉపవాసం ఆరోగ్యానికి మంచిది అనే భావన అందరిలో ఉంటున్నారు. అయితే.. వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. కాగా.. ఉపవాస విషయంలో తగు జాగ్రత్తలు అవసరమంటున్నారు. ఉపవాసంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం లేదు కానీ.. ఉపవాసానికి నాడులు, రోగనిరోధక శక్తి వ్యవస్థల మధ్య సమాచార మార్పిడికీ మధ్య సంబంధం ఉన్నట్టు తాజాగా వెళ్లడైందని పరిశీలకులు చెబుతున్నారు.

క్యాన్సర్ల సమస్యలపై కీలకపాత్ర

కొన్ని గంటలు ఆహారం తినకపోవడం, ఒక రోజూ ఉపవాసం చేయటం మీద రోగానిరోధకశక్తి వ్యవస్థ ఎలా ప్రభావం చూపుతుందో తెలుసు కోవడం కోసం పరిశోధకులు దృష్టి పెట్టారు. అయితే కొన్ని గంటల పాటు కొన్ని ఎలుకలకు ఆహారం పెట్టారు, మరికొన్ని ఎలుకలను ఉపవాసం ఉంచారు. కొన్ని గంటల తర్వాత వెంటనే వాటి రక్త నమూనాలు స్వీకరించారు. ఉపవాసం ఉన్న ఎలుకల్లో మోనోసైట్స్‌ అనే తెల్లరక్తకణాల విషయంతో మార్పులు. ఈ కణాలు శరీరమంతటా తిరుగుతూ ఇన్‌ఫెక్షన్లతో పోరాడటం వంటి ముఖ్యమైన పనులు చేస్తుంది.. గుండెజబ్బు, క్యాన్సర్ల సమస్యలపై కీలకపాత్ర పోషిస్తేందని తెలిపారు.కానీ ఉపవాసం చేసిన వాటిల్లో నాలుగు గంటల తర్వాత మోనోసైట్ల సంఖ్య ఎక్కువగా తగ్గిపోయింది. రక్తంలోంచి మోనోసైట్లు 90 శాతం కనుమరుకాగా.. 8 గంటల తర్వాత అవి మరింత పడిపోయాయి. ఈ మోనోసైట్లు తిరిగి ఎముకమజ్జకు చేరుకొని, నిద్రాణస్థితికి వెళ్లిపోయిటన్లు తెలిపారు.

ఆకలితో కూడిన కోపం వస్తుంది

ఉపవాస ఫలితంగా ఎముకమజ్జలో కొత్త కణాల ఉత్పత్తి తగ్గిపోతోంది. అంతేకాకుండా పాత కణాలు ఎక్కువ సమయం అక్కడే ఉండటం వల్ల రక్తంలోని మోనోసైట్ల కన్నా భిన్నంగా ఉంటుంది. ఒక రోజు తర్వాత ఆహారం తింటే కొద్దిగంటల్లోనే ఎముకమజ్జలో దాచుకున్న మోనోసైట్లు మళ్లీ రక్తంలోకి వచ్చి చేరుకుంతి. దీంతో మారిపోయిన కణాలు ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించటం కన్నా వాపుప్రక్రియను పెంచి ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే శక్తి సన్నగిల్లిందని తెలిపారు. క్యాన్సర్ల, గుండెజబ్బులు వంటి వాటికి వాపు ప్రక్రియే మూల కారణంగా ఉంటుదనే విషయాన్ని చెప్పారు. ఉపవాసం ఉండటం వల్ల మెదడులో ఒత్తిడి పడి ఆకలితో కూడిన కోపం వస్తుందని పరిశోధకులు గుర్తించారు. తెల్లకణాలు రక్తంలోంచి ఎముకమజ్జలోకి.. తిరిగి మజ్జలోంచి రక్తంలోకి వెళ్లిపోవటానికి ఇదే దోహద పడుతుందని తెలిపారు. ఉపవాసంతో జీవక్రియల పరంగా మంచి ప్రయోజనాలు ఉండటం నిజమే.. కానీ అన్నీ లాభాలే ఉంటాయని అనుకోవద్దంటున్నారు నిపుణులు. ఉపవాసం శరీర వ్యవస్థల మీద ఎలాంటి ప్రభావాలను చూపుతోందనేది లోతుగా అర్థం చేసుకోవటానికి అధ్యయనం చేశామని కొందరు పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆస్తులు జప్తు చేస్తాం: బండి సంజయ్

Advertisment
తాజా కథనాలు