Andhra Pradesh: చంద్రబాబుకు ఊరట లభించేనా? బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ..!

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రెగ్యూలర్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

New Update
AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు

Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు(Chandrababu) బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో(AP High Court) విచారణ జరుగుతోంది. ఈ కేసు విచారణ సందర్భంగా పాస్ ఓవర్ అడిగారు సీఐడీ తరఫు న్యాయవాదులు. దాంతో లంచ్ బ్రేక్ ద్వారా విచారణ కొనసాగిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఐదు రోజుల క్రితం హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగగా.. నవంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. దీంతో ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టింది ధర్మాసనం. మరి కోర్టు ఈ బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఈ కేసులో మెడికల్ గ్రౌండ్స్‌పై నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు.. కంటి ఆపరేషన్ చేయించుకున ఇంటివద్దే ఉన్నారు. నవంబర్ 28 న మధ్యంతర బెయిల్ కూడా ముగియనుంది. నవంబర్ 28 వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు మళ్ళీ లొంగిపోవాల్సి ఉంటుంది. ఇవాళ హైకోర్టులో ఆయనకు బెయిల్ లభిస్తే.. ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లు అవుతుంది. ఇక ఇదే కేసుపై సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ కేసును క్వాష్ చేస్తే చంద్రబాబుకు ఈ కేసు టెన్షన్ పోయినట్లవుతుంది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సెప్టెంబర్ 9వ తేదీన సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దాదాపు 53 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కింది స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ వివిధ పిటిషన్లు వేస్తున్నారు. వాటిపై విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం హైకోర్టులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతంది. దాంతో కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలాఉంటే.. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంపై దాఖలైన తొమ్మిది పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి నారాయణతో పాటు.. మరికొంతమంది 9 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా ఫైల్ చేశారు. వీటిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Also Read:

ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయిపోయిన సోనియా గాంధీ.. కారణమిదేనట..!

టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప జిల్లా జైలుకు తరలింపు..

Advertisment
Advertisment
తాజా కథనాలు