Rebel MLA's : హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లో అనర్హత వేటుకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేలు(Rebel MLA's) సుప్రీం కోర్టు(Supreme Court) ను ఆశ్రయించారు. స్పీకర్ తమ పై అన్యాయంగా , రాజ్యాంగ విరుద్దంగా అనర్హత వేటు వేశారంటూ వారు ఆరోపించారు. స్పీకర్ కుల్దీప్ సింగ్ ఎప్పటి నుంచో తమను సభను తప్పించాలని చూస్తున్నట్లు వారు ఆరోపించారు. గత నెల 27న జరిగిన రాజ్య సభ ఎన్నికల సమయంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడడంతో బీజేపీ(BJP) అభ్యర్థి విజయం సాధించారు.
దీని గురించి తెలుసుకున్న కాంగ్రెస్(Congress) అధిష్టానం వారి పై గుస్సా అయ్యింది. అంతేకాకుండా వారి పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కాంగ్రెస్ కోరింది. దీంతో స్పీకర్ వారి పై అనర్హత వేటు వేశారు. రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడడంతో సర్వత్రా చర్చానీయాంశం అయ్యింది. దీని గురించి వేటు పడిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు.
అయితే వారు ఆరుగురు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. క్రాస్ ఓటింగ్ కి పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాటలోనే మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నడవనున్నట్లు సమాచారం. దీని వల్ల హిమాచల్ రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో 40 కాంగ్రెస్ కు, 25 బీజేపీకి, 3 ఇండిపెండెట్లకు ఉన్నాయి.
గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్(Cross Voting) కి పాల్పడడంతో కాంగ్రెస్ కు, బీజేపీకి చేరి 34 సీట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే మరో తొమ్మిది మంది కూడా చేయి వదిలేసేటట్లు కనిపిస్తుంది. ఇదే కనుక జరిగితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలున్నాయి.
Also Read : పగిలిన పాత్రలను ఇంట్లో ఉంచితే ఏమౌతుంది.. ఇంట్లో ఎనిమిది కోణాల అద్దాన్ని ఏ దిక్కున పెడితే మంచిది!