ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి!

రాజస్థాన్‌ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కోసం వెళ్తున్న పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా ..ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి!

రాజస్థాన్‌ చురు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కోసం వెళ్తున్న పోలీసుల వాహనం ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుజన్గడ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తారానగర్లో ప్రధాని మోదీ ఎన్నికల సభకు భద్రత కల్పించేందుకు పోలీసులు వెళ్తున్నారని చురు ఎస్సీ ప్రవీణ్‌ నాయక్‌ వివరించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును పోలీస్‌ వాహనం వెనక నుంచి ఢీకొట్టింది.

ట్రక్కు వెనుక భాగంలో వాహనం దూసుకెళ్లి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా..ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సుజన్‌గఢ్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వాహనం లోపల చిక్కుకున్న వారిని అతి కష్టంతో బయటకు తీశారు.

క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదం లో మృతి చెందిన వారిని ఏఎస్ఐ రామచంద్ర, కానిస్టేబుళ్లు కుంభారం, సురేశ్‌ మీనా, థానరామ్‌, మహేంద్రగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ట్విటర్ వేదిక మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘చురులోని సుజన్‌గఢ్ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐదుగురు పోలీసులు మృతిచెందారు.. మరణించిన పోలీసుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

Also read: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా… ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి టీమిండియా!

Advertisment
Advertisment
తాజా కథనాలు