ఏపీలో విషాదం చోటుచేసుకుంది. డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడి నది పాయ వద్ద పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పడవలో ఉన్న ఆరుగురు వ్యక్తులు గోదావరిలో కొట్టుకుపోయారు. వాళ్లని గమనించిన స్థానికులు మరో పడవతో మూడు కిలోమీటర్ల వరకు చేజింగ్ చేసి ఐదుగురుని సురక్షితంగా రక్షించారు. గోదావరి నది ప్రవాహంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. బాధితులు గిడ్డి ఈశ్వర్ (27), నేలపూడి సత్యనారాయణ(45) గిడ్డి సత్యనారాయణ(45), నేలపూడి యోహాను (20), మద్ద మురళి (23) గా గుర్తించారు.
Also Read: సిగ్గు సిగ్గు జగన్.. షర్మిల విమర్శల దాడి
చదలవాడ విజయ్ (25) అనే వ్యక్తి గోదావరిలో గల్లంతయినట్లు స్థానికులు చెబుతున్నారు. లైఫ్ జాకెట్ చిరిగిపోవడం వల్లే అతడు గల్లంతయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ కోసం సహాయక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలిస్తున్నారు. గత పది రోజుల క్రితం వరద ఉద్ధృతికి తాత్కాలికంగా వేసిన గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా పడవలపైనే రాకపోకలు చేస్తున్నారు. అయితే ఆ గ్రామ ప్రజలకు పంచాయతీ సిబ్బంది మంచినీళ్లు బాటిళ్లు తీసుకెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది.
Also Read: మహానందిలో మరోసారి చిరుత కలకలం!