Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి!

గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్‌ క్రషర్‌ వాహనాన్ని టాటా ఏస్‌ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి చెందారు.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Andhra Pradesh : సోమవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదాలు (Road Accident) హడలెత్తించాయి. ఈ ప్రమాదాల్లో సుమారు ఆరుగురు మరణించగా.. పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా (Guntur District) పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్‌ క్రషర్‌ (Cement Crusher) వాహనాన్ని టాటా ఏస్‌ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మరణించగా..15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. టాటా ఏస్ వాహనంలో డెకరేషన్ చేసే పని వాళ్ళు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని జీజీహెచ్‌కు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇక, శ్రీకాళహస్తి మండల వాంపల్లి దగ్గర ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న సురావారి పల్లికి చెందిన మంగయ్య మృతి చెందాడు. అదే సమయంలో ప్రమాదం జరిగిందని గమనించి కారు దిగి సహాయం చేద్దామని వచ్చిన భార్యాభర్తలు స్వప్న, కిరణ్ కుమార్ ల పైకి అతి వేగంగా ఏర్పేడు ఏస్ఐ పోలీసు వాహనం దూసుకెళ్లింది. పోలీస్ వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు హస్పత్రిలో చికిత్స పోందుతూ భార్య మృతి చెందగా.. భర్త కిరణ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అలాగే, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం పెద బ్రహ్మ దేవంలో చక్రరావు అనే వ్యక్తి రోడ్డు పక్కన పాన్ షాప్ ను నిర్వహిస్తున్నాడు. ఎప్పటి లాగే తన నాలుగేళ్ల మనవడిని షాప్ కి చక్రరావు తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే షాప్ దగ్గర బాలుడు ఆడుకుంటున్న సమయంలో బైక్ ని తప్పించబోయిన కారు ఒక్కసారిగా బాలుడి మీదకు దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Also read: నేడు టీడీఎల్పీ సమావేశం.. హాజరుకానున్న పవన్‌!

Advertisment
తాజా కథనాలు