Telangana Elections 2023: ప్రధాని పర్యటనలో భద్రత లోపం ఘటన.. మరో ఆరుగురిపై సస్పెన్షన్ వేటు

గతేడాది ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటనకు వచ్చినప్పుడు భద్రతా లోపం కారణంగా పంజాబ్‌ హోంశాఖ రెండ్రోజుల క్రితం అప్పటి ఫిరోజ్‌పూర్ జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది.ఇప్పుడు మరో ఆరుగురు పోలీసులను సస్పెండ్‌ చేసింది. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సై, ఏఎస్సై ఉన్నారు.

New Update
Telangana Elections 2023: ప్రధాని పర్యటనలో భద్రత లోపం ఘటన.. మరో ఆరుగురిపై సస్పెన్షన్ వేటు

గత ఏడాది ప్రధాని మోదీ పంజాబ్‌ వచ్చినప్పుడు భద్రతా లోపం కారణంగా ప్రస్తుతం సస్పెన్షన్ల వేటు కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించి రెండ్రోజుల క్రితం అప్పటి ఫిరోజ్‌పూర్‌ జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో ఆరుగురు పోలీసులను పంజాబ్‌ హోంశాఖ సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో ఇప్పుడు మొత్తంగా ఏడుగురు పంజాబ్‌ పోలీసులపై వేటు పడింది. అయితే సస్పెండ్‌ అయిన వారిలో అప్పటి ఫిరోజ్‌పూర్‌ జిల్లా ఎస్పీతో పాటు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సై, ఏఎస్సై ఉన్నారు.

Also read: కొడంగల్లో హైటెన్షన్.. తన్నుకున్న కాంగ్రెస్, బీఆర్​ఎస్ నేతలు

2022 జనవరి 5 పంజాబ్‌లో జరగనున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని ఆ రాష్ట్రానికి చేరుకున్నారు. ముందుగా బఠిండా ఎయిర్‌పోర్టులో దిగి ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్ వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం అనూకూలించక.. రోడ్డు మార్గంలో బయలుదేరారు. అయితే ఆ సమయంలో రైతు చట్టాలపై ఆగ్రహంతో ఉన్న రైతులు ఇందుకు నిరసనగా ప్రధాని వస్తున్న రోడ్డు మార్గాన్ని దిగ్బంధించారు. దీంతో 20 నిమిషాల పాటు ప్రధాని, ఆయన కాన్వయ్‌ వంతెనపైనే ఆగిపోయింది. దీంతో ప్రధాని మోదీ ఆయన వెళ్లాలనుకున్న కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనక్కి తిరిగివెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై గత ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఆ కమిటీ.. పోలీసుల విధి నిర్వహణలోనే లోపాలున్నట్లు సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే పోలీసు సిబ్బందిపై చర్యలు చేపట్టిన పంజాబ్‌ హోంశాఖ తాజాగా ఏడుగురిని సస్పెండ్ చేసింది .

Also read: ఎన్నికల వేళ.. 24 గంటల్లో రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Advertisment
తాజా కథనాలు