IND VS SA: మొత్తం ఏడు బాతు గుడ్లు పెట్టిన భారత్ ప్లేయర్లు.. లాస్ట్‌లో సైకిల్ స్టాండే! కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన రెండో టెస్టులో భారత్ 153 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. మరో బ్యాటర్ ఖాతా తెరవకుండా నాటౌట్‌గా నిలిచాడు. గతంలో 2014లో భారత్ టెస్టు టీమ్‌లో ఆరుగురు డకౌట్ అయ్యారు. By Trinath 03 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఈ మధ్యకాలంలో భారత్ ఆట చూస్తుంటే కొన్నిసార్లు ఇండియన్ టీమ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు దూరారానన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే జట్టులో అనిశ్చితి కనిపిస్తోంది. టీమ్‌లో ఎవరూ ఎందుకు ఉంటున్నారో తెలియదు.. అసలు గేమ్ ప్లాన్ ఉండడం లేదు.. విదేశీ పిచ్‌లపై ఆడాలాన్న కసి కనిపించడంలేదు. అప్పటివరకు బాగా ఆడడం.. వెంటనే కుప్పకూలడం లాంటి వాటిలో నిజానికి పాకిస్థాన్ జట్టుకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు టీమిండియా టెస్టు టీమ్ లాక్కుందానన్న డౌట్ వస్తోంది. సెంచూరీయన్ టెస్టులో ఇన్నింగ్స్‌తో తేడాతో ఓడిన భారత్.. కేప్‌టౌన్ టెస్టులో బౌలింగ్‌లో దుమ్ములేపింది. అయితే బౌలర్ల కష్టాన్ని బ్యాటర్లు సరిగ్గా యూటిలైజ్ చేసుకొలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 153 పరుగులకే పేకాప్ చెప్పేశారు. Indian innings 😭#INDvsSA pic.twitter.com/mmoAlOe3fP — SwatKat💃 (@swatic12) January 3, 2024 లాస్ట్‌లో ఆ ఆట ఏంటి బ్రో? అటు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంటే ఇండియాకు వచ్చింది కేవలం 98 పరుగుల లీడ్ మాత్రమే. దక్షిణాఫ్రికా ఏ భారీ స్కోరో చేస్తే ఈ లీడ్ మంచిదే అనుకోవచ్చు కానీ.. వాళ్లు చేసింది కేవలం 55 రన్సే కావడం.. ఇండియావాళ్లు ఓ స్టేజీలో 105/3తో ఉండడం.. చివరి 48 రన్స్ వ్యవధిలో 7 వికెట్లు కోల్పోవడం భారత్ అనిశ్చితికి అద్దం పడుతోంది. 153 పరుగుల వద్ద 5వ వికెట్ లాస్ అయిన టీమిండియా అదే స్కోర్ వద్ద ఆలౌట్ అయ్యింది. చివరి 8 బంతుల్లో నాలుగు వికెట్లు ఢమాల్ అయ్యాయంటే భారత్ ఎంత నిలకడలేని ఆటతీరుతో బాధపడుతోందో అర్థం చేసుకోవచ్చు. 6 wickets in 11 balls without a single run.#INDvsSA pic.twitter.com/27ist8J1tJ — Munaf Patel (@munafpa99881129) January 3, 2024 భారత్ బ్యాటర్లలో కోహ్లీ, రోహిత్, గిల్ పర్వాలేదనిపించారు. ఈ ముగ్గురు మినహా ఏ ఒక్కరూ కూడా రాణించలేదు. రాణించడం సంగతి పక్కన పెడితే ఖాతా కూడా తెరవలేదు. భారత్ బ్యాటింగ్‌లో సింగిల్ రన్ కూడా చేయని బ్యాటర్ల సంఖ్య 7గా ఉంది. అందులో ఆరుగురు డకౌట్.. 11వ బ్యాటర్ ముఖేశ్ జీరో రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అంటే మొత్తం ఆరుగురు ప్లేయర్లు బాత్ గుడ్లు పెట్టారన్నమాట. 2014లో ఇంగ్లండ్‌పై మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇలా ఆరుగురు భారత్ ప్లేయర్లు డకౌట్ అయ్యారు. మళ్లీ 10ఏళ్లకు ఈ సీన్ రిపీట్ అవ్వడంతో అసలు మనం ఉన్నది 2024లోనా లేదా 2014లోనా అర్థంకాని దుస్థితి. లేకపోతే 2012-14మధ్యకు టైమ్ ట్రావెల్ చేసి అదే ఆటను రోహిత్ సేన కాపీ కొడుతుందానన్న ఫీలింగ్ 20s కిడ్స్ ఫ్యాన్స్‌లో కలుగుతోంది. Trending Meme 😬#INDvsSA | #INDvSA pic.twitter.com/gMl9ZP4HlA — Don Cricket 🏏 (@doncricket_) January 3, 2024 Also Read: ఆరు వికెట్లతో విజృంభించిన సిరాజ్..55 పరుగులకే సఫారీలు ఆల్ అవుట్ WATCH: #virat-kohli #rohit-sharma #cricket #india-vs-south-africa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి