Sri Rama Navami Wishes : శ్రీరాముని కృప దేశ ప్రజలందరికీ ఉండాలని కోరారు ప్రధాని మోదీ(PM Modi). శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ రాముని దయ వల్లనే ఈ ఏడాది అయోధ్య(Ayodhya) లో ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. రాముని కటాక్షం వల్లనే లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయని చెప్పారు. ఇది దేశ ప్రజలు ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితమని మోదీ సంతోషాన్ని వ్యక్ం చేశారు. ఎక్స్(X) లో తన ఆనందాన్ని పంచుకున్నారు.
దేశ ప్రజల్లో అణువణువునా శ్రీరాముడు కొలువైవున్నాడని అన్నారు మోదీ. రామ పురుషోత్తముడి జీవితం, ఆశయాలు.. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన ఆధారం అవుతాయని తన పూర్తి నమ్మకమని చెప్పారు. ఆయన ఆశీస్సులు స్వయంసమృద్ధ భారత్ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నాను అందుకే శ్రీరాముని పాదాలకు శిరస్సు వంచి మరీ ప్రమాణాలు చేస్తున్నా అంటూ ఉద్వేగం పోస్ట్ పెట్టారు.
Also Read : మా రామయ్య పెళ్లికొడుకాయనే..!
మరో వైపు అమిత్ షా(Amit Shah), ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) లు కూడా కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరామ్(Jai Sri Ram).. అందరికీ పవిత్రమైన శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తముదైన శ్రీరాముడు తన జీవితంతో సత్యం, త్యాగం తదితర విలువలతో అత్యున్నత ఆదర్శాన్ని స్థాపించాడు. యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు కృషి చేశాడు. 500 ఏళ్ల తర్వాత ఈ ఏడాది స్వామి జన్మదినోత్సవాన్ని ఆయన జన్మస్థలంలో జరుపుకోవడం రామభక్తులందరికీ గర్వకారణం. అందరి క్షేమం కోరుతూ శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ అమిత్ షా కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.