PM Modi : ఎన్నో శతాబ్దాల నిరీక్షణ.. శ్రీరామ నవమికి ప్రధాని శుభాకాంక్షలు శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షుల తెలిపారు. 5 శతాబ్దాల నిరీక్షణకు ఫలితం లభించిందని...నేడు అయోధ్యలో జరుగుతున్న మొదటి ఉత్సవమని అన్నారు. By Manogna alamuru 17 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sri Rama Navami Wishes : శ్రీరాముని కృప దేశ ప్రజలందరికీ ఉండాలని కోరారు ప్రధాని మోదీ(PM Modi). శ్రీరామ నవమి(Sri Rama Navami) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ రాముని దయ వల్లనే ఈ ఏడాది అయోధ్య(Ayodhya) లో ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. రాముని కటాక్షం వల్లనే లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయని చెప్పారు. ఇది దేశ ప్రజలు ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితమని మోదీ సంతోషాన్ని వ్యక్ం చేశారు. ఎక్స్(X) లో తన ఆనందాన్ని పంచుకున్నారు. దేశ ప్రజల్లో అణువణువునా శ్రీరాముడు కొలువైవున్నాడని అన్నారు మోదీ. రామ పురుషోత్తముడి జీవితం, ఆశయాలు.. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన ఆధారం అవుతాయని తన పూర్తి నమ్మకమని చెప్పారు. ఆయన ఆశీస్సులు స్వయంసమృద్ధ భారత్ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నాను అందుకే శ్రీరాముని పాదాలకు శిరస్సు వంచి మరీ ప్రమాణాలు చేస్తున్నా అంటూ ఉద్వేగం పోస్ట్ పెట్టారు. यह पहली रामनवमी है, जब अयोध्या के भव्य और दिव्य राम मंदिर में हमारे राम लला विराजमान हो चुके हैं। रामनवमी के इस उत्सव में आज अयोध्या एक अप्रतिम आनंद में है। 5 शताब्दियों की प्रतीक्षा के बाद आज हमें ये रामनवमी अयोध्या में इस तरह मनाने का सौभाग्य मिला है। यह देशवासियों की इतने… — Narendra Modi (@narendramodi) April 17, 2024 Also Read : మా రామయ్య పెళ్లికొడుకాయనే..! మరో వైపు అమిత్ షా(Amit Shah), ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) లు కూడా కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరామ్(Jai Sri Ram).. అందరికీ పవిత్రమైన శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తముదైన శ్రీరాముడు తన జీవితంతో సత్యం, త్యాగం తదితర విలువలతో అత్యున్నత ఆదర్శాన్ని స్థాపించాడు. యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు కృషి చేశాడు. 500 ఏళ్ల తర్వాత ఈ ఏడాది స్వామి జన్మదినోత్సవాన్ని ఆయన జన్మస్థలంలో జరుపుకోవడం రామభక్తులందరికీ గర్వకారణం. అందరి క్షేమం కోరుతూ శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ అమిత్ షా కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. जय श्री राम! सभी को रामनवमी के पावन पर्व की बहुत-बहुत शुभकामनाएँ। मर्यादा पुरुषोत्तम भगवान राम का जीवन न्याय, जनकल्याण व स्वाभिमान के लिए संघर्ष का प्रतीक है। प्रभु ने अपने जीवन से सत्य व धर्म के लिए त्याग का सर्वोच्च आदर्श स्थापित कर समूचे विश्व को युगों-युगों तक मार्गदर्शित… pic.twitter.com/yiSWEeFhKY — Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 17, 2024 #amit-shah #pm-modi #sri-rama-navami-wishes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి