Singer KS Chithra Birthday Special : ఏ పాట పాడినా.. ఏ భావం పలికిన.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె వరం. తనకున్న గాత్ర నైపుణ్యంతో ఎంతో మంది దిగ్గజ సింగర్స్‌తో గొంతు కలిపిన ఆమె.. అనేక భాషల్లో తన మధురమైన స్వరంతో లక్షలాది మంది హృదయాలను దోచారు. ఆమె మరెవరో కాదు 'నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా' పేరు పొందిన ప్రముఖ గాయని KS చిత్ర. నేడు (జులై 27) ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె జీవితం, కళా ప్రస్థానం గురించి తెలుసుకుందాం..
బాల్యం నుండి బాలీవుడ్ వరకు
కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన చిత్ర, సంగీతం పట్ల ఉన్న అభిమానంతో చిన్నప్పటి నుండి పాటలు పాడేవారు. తండ్రి కృష్ణన్ నాయర్ ఆమెకు మొదటి గురువు. తన మొదటి పాటను 1979లో రికార్డ్ చేసినప్పటికీ, 1983లో విడుదలైన 'అట్టాసం' చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైంది.
తెలుగు సినీ సంగీతంలో ఒక మైలురాయి
80వ దశకం నుండి తెలుగు సినీ సంగీతంలో చిత్ర తనదైన ముద్ర వేసింది. ఆమె స్వరం, తీరు ప్రత్యేకంగా ఉండటంతో ప్రతి పాటను హిట్ చేసేవారు. ఇళయరాజా, మణిశర్మ వంటి సంగీత దర్శకులతో కలిసి ఎన్నో అద్భుతమైన పాటలను అందించింది.
అవార్డులు, గుర్తింపులు
చిత్ర తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు అందుకుంది. 6 జాతీయ అవార్డులు, అనేక రాష్ట్ర అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి అనేక భాషల్లో పాడింది. 25,000కు పైగా పాటలు పాడిన ఆమెను 'నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా' అని అంటారు.16 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్,, 11 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 4 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 3 కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 1 ఒరిస్సా స్టేట్ ఫిల్మ్ అవార్డు, 1 వెస్ట్ బెంగాల్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్‌లను సొంతం చేసుకున్నారు.
ఆరు వేర్వేరు భారతీయ రాష్ట్రాల నుండి 36 రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. అలాగే ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నుంచి అందుకున్నారు. భారతీయ సంగీత కమ్యూనిటీకి ఆమె చేసిన గణనీయమైన కృషికి, ఆమె 2005, 2021లో భారతదేశం మూడవ, నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ, పద్మభూషణ్‌లను అందుకున్నారు.
Also Read: మంత్రి కొండా సురేఖను కలిసిన రేణు దేశాయ్.. ఎందుకో తెలుసా?