Pallavi Prashanth Arrest: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో ముందు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించార. కంటెస్టెంట్స్ కార్ల అద్దాలను పగలగొడుతూ.. దాడులకు పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సుల అద్దాలను పగలగొట్టి ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంశం చేశారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth), అతని అభిమానుల పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం సాయంత్రం అతని నివాసం గజ్వేల్ లోని కొల్లూరు లో అరెస్ట్ చేశారు.
పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడుని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో A1 గా ప్రశాంత్ ను, A2, A3, A4... అతని సహచరులను చేర్చారు. బుధవారం రాత్రి వైద్య పరీక్షల అనంతరం ప్రశాంత్, అతని సోదరుడిని నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. కోర్టులో విచారణ జరిపిన అంతరం ఇద్దరికీ 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు చెంచల్ గూడ జైలుకు తరలించారు.
ఈ దాడులకు కారణమైన 16 మంది యువకుల గురించి కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టీమ్, పోలీసులు హెచ్చరించినప్పటికీ.. లెక్క చేయకుండా ర్యాలీ చేసినందుకే ప్రశాంత్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన పై సింగర్ భోలే షావలి (Singer Bhole Shavali) ప్రశాంత్ కు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రశాంత్ బెయిల్ కోసం సింగర్ భోలే న్యాయవాదిని తీసుకొచ్చారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన.. ఇలా జరిగినందుకు ఉందని తెలిపారు.
Also Read: Bigg Boss 7 Winner: అరెస్ట్ తరువాత పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నాడంటే..