Skin Care : సహజంగా అమ్మాయిలు(Ladies) అందంగా కనిపించాలని ఆశపడతారు. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు(Food Habits), జీవన శైలి(Life Style) విధానాలు మొహం(Face) పై మొటిమలు(Pimples), ఇతర మార్పులకు కారణమవుతుంటాయి. మొటిమలను చేతులతో ముట్టుకోడం, వాటిని గిల్లడం ద్వారా అవి నల్ల మచ్చలుగా మారతాయి. ఇవి మొహాన్ని అందవికారంగా చేస్తాయి. ఇలా నల్ల మచ్చల సమస్యతో బాధపడేవారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇంట్లో దొరికే వాటితో తయారు చేసే ఈ స్క్రబ్స్ మొహం పై అప్లై చేస్తే నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు చూడండి.
ఓట్స్, పాలు మిశ్రమం
ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ లో పాలు కలిపి దాన్ని చిక్కటి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొహం పై అప్లై చేసి.. ఒక 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. రెగ్యులర్ ఇలా చేస్తే మంచి ప్రభావం ఉంటుంది.
కాఫీ పౌడర్ ప్యాక్
స్వచ్ఛమైన కాఫీ గింజల పొడి(Coffee Bean Powder) లో కొబ్బరి నూనె కలుపుకొని మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్(Face Pack) లా అప్లై చేసుకుంటే నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మకాయ, షుగర్ మిశ్రమం
నిమ్మకాయ, షుగర్ నల్ల మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. ఒక టేబుల్ స్పూన్ షుగర్ లో కాస్త నిమ్మరసం, కావాలంటే తేనె కూడా కలుపుకోవచ్చు. ఇలా తయారు తయారు చేసిన మిశ్రమాన్ని మొహానికి రాసి.. కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది.
బొప్పాయి, పైనాపిల్
బొప్పాయి, పైనాపిల్ పండును గుజ్జుగా చేసి దాంట్లో చక్కెర లేదా ఓట్స్ ను కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొహం పై అప్లై చేసి కాసేపు మర్దన చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి : ఈ ఫుడ్ తింటే బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ పోతాయి.. హార్వర్డ్ రిపోర్ట్!