Relationship : ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లని అసలు వదులుకోకూడదు.. నిజమైన లవర్స్‌ ఎలా ఉంటారంటే?

వీచే గాలిని ఆపలేనట్టే మదిలో ప్రేమని కూడా ఆపలేమంటారు ప్రేమికులు. ఇటీవలి కాలంలో బ్రేకప్‌ సర్వసాధరణమైపోయింది. ఈ విషయంలో కొంతమంది తొందరపడి బ్రేక్‌ చెబుతుండగా.. మరికొంతమంది మంచిగా ఆలోచించే లవ్‌ బ్రేక్ చేస్తున్నారు. నిజమైన ప్రేమ తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Relationship : ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లని అసలు వదులుకోకూడదు.. నిజమైన లవర్స్‌ ఎలా ఉంటారంటే?

Good Love Relationship : ఒక చల్లని ఊహ, వెచ్చని స్పర్శ మనసును ఏదో లోకంలోకి తీసుకెళ్తుంది. అయితే ప్రతి ప్రేమ(Love) లోనూ స్పర్శ ఉండకపోవచ్చు.. కానీ ఊహాలు మాత్రం ఉంటాయి. ప్రతి ప్రేమ పెళ్లి(Marriage) కి దారి తియ్యకపోవచ్చు.. కానీ నిజమైన ప్రేమికులు ప్రతిక్షణం వారు ప్రేమించినవారి కోసమే శ్వాసిస్తారు, ఆలోచిస్తారు. మనస్పర్థలు వచ్చి దూరంగా ఉన్నా వారి మంచి కోసమే పరితస్తారు. ఎంత దూరంగా జరిగినా దగ్గరగానే ఉన్నట్టే అనిపించే ప్రేమికులు(Lovers) ఉంటారు. మీకు అలా ఎవరితోనైనా అనిపిస్తే అలాంటి వారిని వదులుకోవద్దు. ఇక ఎలాంటి లక్షణాలున్న వారిని వదలుకోకూడదో ఇవాళ మేం మీకు చెప్పబోతున్నాం..!

--> సాధారణంగా ఏ ఇద్దరి మధ్య అయినా గొడవలు సాధారణమే. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు సైలెంట్‌గా ఉంటే ఆ గొడవ కాసేపటికి సమిసిపోతుంది. మీరు మీ లవర్‌ లేదా లైఫ్‌ పార్టనెర్‌(Life Partner) పై అరిచినప్పుడు లేదా లిమిట్‌ దాటి తిట్టినప్పుడు తిరిగి ఏం అనకుండా, వాళ్లు కామ్‌గా ఉంటే అలాంటివారిని అసలు వదులుకోవద్దు.

--> కొన్నిసార్లు మీరు మీ కుటుంబం, మీ స్నేహితులు అంగీకరించని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సమయంలో వారంతా మిమ్మల్ని కూడా వదిలేస్తారు. అప్పుడు మీ బాయ్‌ఫ్రెండ్‌/గర్ల్‌ఫ్రెండ్‌ మీకు సపోర్ట్‌గా నిలిస్తే వారిది నిజమైన ప్రేమగా భావించవచ్చు.

--> మీ ఇద్దరి మధ్య చాలా విషయాల్లో వివాదం ఉన్నప్పటికీ ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకుంటే అది రియల్‌ లవ్‌ అని చెప్పవచ్చు. అనేక విషయాలపై మీకు భిన్నమైన దృక్పథాలు ఉండవచ్చు.. కానీ ఒకరు ఆలోచనలు మరొకరు గౌరవించుకుంటూ ఉంటే మీ రిలేషన్‌షిప్‌ సరైన మార్గంలో వెళ్తున్నట్టే అనుకోవచ్చు. మీ అభిరుచులకు తనకు నచ్చకున్నా వాటిని గౌరవిస్తూ మిమ్మల్ని అవి మానేయమని చెప్పకుండా ఉంటున్నారంటే అది వారిలో మంచి లక్షణం కావొచ్చు.

--> ఒకరినొకరు కోల్పోతామనే భయం ఉన్నా అది ప్రేమే కావొచ్చు. అయితే ఇది ప్రతీసారి ప్రేమ అవ్వాలని లేదు. కొన్నిసార్లు అభద్రత కూడా ఇలాంటి ఆలోచనలను కలగిస్తుంది. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ భయం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోగలగాలి. ఒకవేళ మీ లవర్‌ లేదా లైఫ్‌ పార్టనెర్‌ మీరు హర్ట్‌ చేసినా మీతోనే ఉండాలని, మీతో మాట్లాడి గొడవను పరిష్కరించుకోవాలని ఆలోచిస్తుంటే వారిది నిజమైన ప్రేమ కావొచ్చు.

--> సాధారణంగా మన ఆలోచనలు(Thoughts) మన లవర్‌ ఆలోచనలకు సరిపోలాలని అందరూ కోరుకుంటారు. ఇందులో ఏ మాత్రం తప్పు లేకున్నా అది నిజానికి జరగని పని.. ఎందుకంటే ఏ రెండు మనసులు ఒకేలాగా ఉండవు. అయితే నిజమైన ప్రేమలో భాగస్వాములు ఇద్దరూ ఒకరి ఆలోచనలను మరొకరు స్వీకరిస్తారు..వాటికి మద్దతుగా ఉంటారు. తమ అభిప్రాయాలను ఒకరిపై ఒకరు రుద్దరు. విభేదాలు ఉంటే అంగీకరిస్తారు. కానీ ఒకరి ఆలోచనలను మరొకరు చెరిపివేసేందుకు ప్రయత్నించరు.

ఇది కూడా చదవండి: చికిత్స లేని వ్యాధి.. లైంగిక కోరికలు రాకుండా చేసే ఈ రోగం గురించి తెలుసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు