Africa : ఆఫ్రికాలో ఎమెర్జెన్సీ.. కుష్‌తో ఊగిపోతున్న జనం

దేశం మొత్తం మత్తులో పడి కొట్టుకుంటున్నారు. కుష్ అనే మత్తు పదార్ధం కోసమే బతుకుతున్నారు ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ యువత. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆఫ్రికా దేశాధ్యక్షుడు సియోర్రా లియోన్‌లో ఎమెర్జెన్సీ విధించారు.

New Update
Africa : ఆఫ్రికాలో ఎమెర్జెన్సీ.. కుష్‌తో ఊగిపోతున్న జనం

Khush Drug : ఆఫ్రికా(Africa) ఖండంలోని సియోర్రా లియోన్ దేశం మత్తులో ఊగుతోంది. కుష్ అనే మత్తు పదార్ధానికి అక్కడి ప్రజలు బానిసలుగా మారారు. ఆరేళ్ళ క్రితం ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన కుష్(Kush) అక్కడి యువతను బలి తీసుకుంటోంది. నిత్యం అంతర్గత కలహాలు, జాతుల మధ్య ఘర్షణలు వంటి సమస్యలతో సతమతమయ్యే అక్కడ యువకులు చేసేందుకు పనిలేక మత్తు పదార్ధాలకు అలవాటు పడిపోయారు. దీనికి తోడు కుష్ వచ్చి చేరడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది.

కుష్‌తో చచ్చిపోతున్న జనాలు..

సియోర్రా లియోన్‌(Sierra Leone) లో ప్రజలు బానిసగా మారిన కుష్ అనే మత్తు పదార్ధం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనివల్ల ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారనేది లెక్క లేదు కానీ.. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం వందల్లో ఉందని చెబుతున్నారు అక్కడి వైద్యులు. కుష్ వల్ల ముఖం వాచిపోయి, శరీరమంతా గాయాలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ డ్రగ్ కారణంగా బాడీలో అవయవాలు దెబ్బతింటున్నారు. దీనివల్ల 2020 నుంచి 2023 మధ్యలో 4000వేలమంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించడానికే ఇదే బలమైన కారణమని అంటున్నారు.

ఎముకల కోసం శ్మశానాలు తవ్వుతున్నారు..

కుష్ అనేది పలురకాల మత్తు పదార్ధాల మిక్స్. ఇందులో మనిషి ఎముకలను కూడా వాడతారని చెబుతున్నారు. దీంతో సియోర్రాలో శ్మశానాలు అన్నీ గోతులుగా మారుతున్నాయి. మనుషుల ఎముకల కోసం డ్రగ్ డీలర్లు(Drug Dealers) దారునాలకు పాల్పడుతున్నారు. దొంగలకు డబ్బులిచ్చి సమాధులను తవ్విస్తున్నారు. అస్థిపంజరాలను బయటకు తీయించి డ్రగ్ తయారీదారులకు అమ్మేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఇలా చాలా సమాధులను తవ్వేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ శ్మశానాల దగ్గర భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కుష్ అనేది సింథటిక్ డ్రగ్. దీనివలన ప్రజలకు చాలా నష్టమే జరుగుతోందని అ దేశ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో పాటూ ఈ మత్తు పదార్ధాన్ని నియంత్రించుందుకు ప్రత్యేకపైన టాస్క్‌ ఫోర్స్‌(Task Force) ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే డీలర్ల పని పట్టేందుకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Also Read : Hyderabad : హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో తేజస్‌ హత్య వెనుక సంచలన విషయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు