Alcohol Side Effects: మద్యం సేవించే వారికి షాకింగ్ న్యూస్. మద్యం సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న మొత్తంలో కూడా ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అందుకే మద్యానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు స్వయంగా సలహా ఇస్తున్నారు. ఆల్కహాల్ క్యాన్సర్ (Cancer), గుండె జబ్బులతో (Heart Diseases) సహా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని పేర్కొన్నారు.
ALSO READ: మేము గెలిచుంటే కేటీఆర్‌ను జైళ్లో పెట్టేవాళ్ళం.. బండి సంజయ్ గరం
చర్మంలో మార్పులు..
మద్యం రెగ్యులర్ గా సేవించడం వల్ల హెపటైటిస్, సిర్రోసిస్ వంటివి వచ్చే ప్రమాదం (Skin Problems) ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. కామెర్లు, కళ్ల చుట్టూ చర్మం నల్లబడటం, దురద వంటి సమస్యలు ఎదురుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
క్యాన్సర్ వచ్చే ప్రమాదం..
మీరు మద్యపానానికి బానిసలైతే, ఎక్కువసేపు దాని వినియోగం మీ రోగనిరోధక శక్తిని (Immunity) బలహీనపరుస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. దీని కారణంగా మీరు సులభంగా అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. అంతేకాకుండా, బలహీనమైన రోగనిరోధక శక్తి, UV కిరణాలకు పెరిగిన సున్నితత్వం కారణంగా చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని తెలుపుతున్నారు.
నిద్రకు చెక్..
ఆల్కహాల్ తాగడం వల్ల మీ నిద్ర కూడా దెబ్బతింటుంది, దీని కారణంగా మీ నిద్ర విధానం అంతరాయం కలిగిస్తుంది. సరిగా నిద్రపోకపోవడం వలన నల్లటి వలయాలు, చర్మం పసుపు, రంగు మారడం, ముడతలు వంటి సమస్యలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
గుండెకు ప్రమాదం..
ఆల్కహాల్‌లో చాలా కేలరీలు ఉంటాయి. ఫలితంగా బరువు పెరిగేందుకు ఇది దారి తీస్తాయి. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదే పనిగా రోజూ మద్యం తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతూ.. అనేక గుండె సమస్యలకు దారి తీస్తాయి.
ALSO READ: కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి.. కిషన్ రెడ్డి హెచ్చరికలు