BRS MLA Harish Rao: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రానందున ఎవరూ కుంగిపోవాల్సిన పనిలేదని, వచ్చే పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో మన సత్తా చూపిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు.
ALSO READ: Movierulz, iBOMMA లో సినిమాలు చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని బీఆర్ఎస్ కార్యకర్తలతో అన్నారు. ఎవరు తొందరవపడి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులే అవుతోందని ఇప్పుడే విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైతే ప్రజా గొంతుక అవుదాం అని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని ఎవరు బాధపడొద్దని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని తెలిపారు. ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడుదామని అన్నారు.
ALSO READ: ఆసుపత్రికి రావద్దు.. కేసీఆర్ సంచలన వీడియో
అధికార పార్టీ వాళ్లు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. కార్యకర్తలు, నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనమెప్పుడూ ప్రజల పక్షమే అని పేర్కొన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటం అని హరీష్ రావు తెలిపారు.