Movie Review:కొత్త హీరో, డైరెక్టర్‌ల సిద్ధార్ధ్ రాయ్ సక్సెస్ అయ్యాడా.. కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్లతో అర్జున్ రెడ్డి 2.0 గా వచ్చిన సిద్ధార్థ రాయ్ సినిమా శుక్రవారం విడుదల అయింది. యూత్ టార్గెట్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..కొత్త దర్శకుడు సక్సెస్ అయ్యాడా..కింద రివ్యూలో చదవండి. By Manogna alamuru 24 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన దీపక్ సరోజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ...హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి లాంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన యశస్వి తీసిని మూడీ సిద్ధార్ధ్ రాయ్. బోల్డ్ అండ్ వైల్డ్‌గా ఈ సినిమా తీసారు. ప్రమోషన్స్, ట్రైలర్స్ చూసి సిద్ధార్ధ్ రాయ్ సినిమాను అర్జున్ రెడ్డి 2.0గా కామెంట్స్ చేశారు. యూత్ టార్గెట్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. కథ... 12ఏళ్ళకే వరల్డ్‌లో ఉన్న ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివేస్తాడు సిద్ధార్ధ్ రాయ్. దీంతో ఏమీ ఎమోషన్స్ లేకుండా తయారవుతాడు. ఎవరేమడిగినా లాజిక్స్ చెబుతూ ఉంటాడు. ఆకలి వేస్తే ఏది కనబడితే అది తింటాడు, నిద్ర వస్తే ఎక్కడ చోటు కనబడితే అక్కడ పడుకుంటాడు. కోరిక కలిగితే నచ్చిన అమ్మాయిని ఒప్పించి అవసరాలు తీర్చుకుంటాడు. అలా ఉన్న సిద్ధార్ధ్ లైఫ్‌లోకి ఇందు(తన్వి నేగి) వస్తుంది. ఈమెతో హీరో ఎలా ప్రేమలో పడ్డాడు...ఏం నేర్చుకుంటాడు? వారి ఇద్దరి మధ్యా ఏం సంఘర్షణ జరిగింది...మధ్యలో వచ్చే రాధ(నందిని యల్లారెడ్డి) పాత్ర ఏంటి? చివరకు సిద్ధార్ధ్ రాయ్ మారాడా లేదా లాంటివి చూడాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉంది... ఇక సినిమా గురించి గురించి వస్తే దర్శకుడు యశస్వి తీసుకున్న పాయింట్ కొత్తగానే ఉంది. కానీ దాన్ని సినిమాగా తీసేటప్పటికీ తడబడ్డాడు. బుద్ధుని జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఒక కథను మలుచుకున్నాడు. ఈ కాలానికి తగ్గట్టు మలచడానికి ట్రై చేశాడు. కానీ డైరెక్టర్ అతని ఆలోచనను పూర్తిగా తెర మీదకు తీసుకురాలేకపోయాడనేది టాక్. ఎమోషన్స్, లాజిక్‌కు మధ్య నలిగిపోయే వ్యక్తిగా హీరోను చూపించాలనుకున్నారు కానీ ఈ క్రమంలో అవసరానికి మించిన డ్రామా, బోల్డ్ సీన్స్ పెట్టేసరికి మొత్తం దాని కాన్సెప్ట్ మారి పోయింది. డైరెక్టర్ యశస్వి పనిచేసింది హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి దగ్గరే అయినా ఇతని మీద సందీప్ రెడ్డి వంగా ప్రభావం బాగా ఉంది. కథ , దాన్ని మలిచిన తీరు, హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం అన్నీ అచ్చు అర్జున్ రెడ్డి, యానిమల్ ను పోలి ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. దానికి తోడు బోలెడన్ని బూతులు, బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో దర్శకుడు చెప్పాలనుకున్నది డీవియేట్ అయిపోయింది. ఇది కచ్చితంగా కేవలం యూత్ మాత్రమే చూడదగ్గ సినిమా. ఫ్యామిలీ ఆడియెన్స్ దూరంగా ఉంటేనే మంచింది. మొత్తం సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం బాగా పండాయి. కానీ కేవలం వాటిని ఆధారంగా చేసుకుని సినిమా అంతా చూడలేము. పైగా అర్జున్ రెడ్డి, యానిమల్ పోలికతో కూడా దెబ్బ పడేటట్టుగానే ఉంది. ఓటీటీ సినిమాగా సక్సెస్ అయితే అవ్వొచ్చు కానీ థియేటర్లలో కాస్త కష్టమే అనే టాక్ నడుస్తోంది. ఇక హీరోగా చేసిన దీపక్ సరోజ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌కు మీసాలు పెట్టినట్టు ఉంది అంటున్నారు ఇతన్ని చూసిన వారు. హీరోయిన్ తన్వి నేగి అస్సలు సిగ్గుపడకుండా బోల్డ్ సీన్లు చేసింది. ఒక సాంగ్ మినహా రధన్ ఇచ్చిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ ఇంకా బెటర్ గా ఉంటే బాగుంటుంది. ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఒకసారి చూడొచ్చు. #telugu #movies #review #siddarth-roy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి