Siddha Ramaiah : ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. మోదీ.. దేశ ప్రధాని పదవి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పడం, ప్రజల మనోభావాలను మంటగలపడం ఆయనకు అలవాటుగా మారిపోయిందంటూ మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ(PM Modi) గొప్ప వ్యక్తం అంటూ చురకలింటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' అబద్ధాలు చెప్పడంలో ప్రధాని గొప్పవారు. అసంబద్ధ మాటలు మాట్లాడుతూ ప్రజల మనోభావాలు రెచ్చగొడుతున్నారు. ఎదుటివారి గౌరవాన్ని దెబ్బతీసేందుకు యత్నస్తున్నారు. ఆయన చేస్తున్న చర్యలు ప్రధాని పదవిపై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయి.
Also Read: లోక్‌సభ ఎన్నికల వేళ.. కుతుబ్ మినార్‌పై సరికొత్త ప్రదర్శన
మోదీ చేసిన రిజర్వేషన్, మంగళసూత్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్(Congress).. ఎలక్షన్ కమిషన్(Election Commission) కు ఫిర్యాదు చేసింది. వాటిపై ఇంకా చర్యలు తీసుకోలేదు. ప్రధాని అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలే మమ్మల్ని గెలిపిస్తాయి. మేము ఇచ్చిన ఐదు హామీలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఇదే తమ గెలుపుకు సంకేతం. ప్రజలు తమ విచక్షణను బట్టి తీర్పునిస్తారు. ఓటర్లు తెలివైన వారు. మాయ మాటలు నమ్మరు. వాళ్లు రాజకీయంగా పరిణితి చెందారు.
Also Read: నోటా’ పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు!