Shyamala Devi : ప్రభాస్ పెళ్లి పై శ్యామలా దేవి కామెంట్స్.. సక్సెస్ రాదన్నారు వచ్చింది, పెళ్లి కూడా అంతే!

శ్యామలా దేవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ప్రభాస్ పెళ్లి పై స్పందించారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు విజయం దక్కదని అన్నారు. కానీ, వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రభాస్‌ పెళ్లి విషయంలోనూ అంతే. పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. కానీ, సమయం రావాలి' అని అన్నారు.

Shyamala Devi : ప్రభాస్ పెళ్లి పై శ్యామలా దేవి కామెంట్స్.. సక్సెస్ రాదన్నారు వచ్చింది, పెళ్లి కూడా అంతే!
New Update

Shyamala Devi About Prabhas Marriage : పాన్ ఇండియా హీరో (PAN INDIA HERO) ప్రభాస్ (Prabhas) పెళ్ళికి రెడీ అయినట్లు గత ఏడాది నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ పెద్దమ్మ కూడా ఆ మధ్య ఇదే చెప్పారు. దీంతో డార్లింగ్ మ్యారేజ్ కి సంబంధించి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. గతంలో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. కానీ అవేవీ వాస్తవాలు కాదని తేలింది.

రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌ తో ప్రభాస్ లవ్‌లో ఉన్నారంటూ కూడా టాక్ వినిపించింది. అది కూడా అవాస్తవమే. ప్రభాస్ పెళ్లి చేసుకునే దాకా ఈ రూమర్స్ ఆగవు. మరోవైపు, ప్రభాస్‌కు పెళ్లికాదంటూ జ్యోతిష్యులు చెప్పడం నెట్టింట చర్చకు దారి తీసింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూల్లో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి (Shyamala Devi) మరోసారి పెళ్లి పై స్పందించింది.

Also Read : ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘పుష్ప’ విలన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తాజా ఇంటర్వ్యూలో శ్యామలా దేవి మాట్లాడుతూ.." మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో రుజువైంది (కల్కి సక్సెస్‌ని ఉద్దేశిస్తూ). ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు విజయం దక్కదని కొందరు అన్నారు. కానీ, వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రభాస్‌ పెళ్లి విషయంలోనూ అంతే. కోట్లాది అభిమానులు ఆశించినట్టుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్‌ ఎంతగానో శ్రమిస్తున్నాడు. బాధ్యతగా తీసుకుని దృష్టి మరలకుండా అలా చేస్తున్న ఆయన గొప్ప వ్యక్తి. పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. కానీ, సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటి వరకూ ఆయన ఆశించినవన్నీ జరిగాయి. మ్యారేజ్‌ (Marriage) కూడా జరుగుతుంది" అని అన్నారు.

#pan-india-hero #shyamala-devi #prabhas-marriage #tollywood
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe