Shubman Gill: వన్డేల్లో తోపుగాడు.. టెస్టుల్లో తుస్సుగాడు.. కావాలంటే ఈ లెక్కలు చూడండి!

వన్డేల్లో దుమ్ములేపుతోన్న టీమిండియా యువసంచలనం శుభమన్‌గిల్‌ టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో కేవలం 2పరుగులే చేసి ఔట్ అయ్యాడు. గత ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లో గిల్‌ అత్యధిక స్కోరు 29మాత్రమే.

New Update
Shubman Gill: వన్డేల్లో తోపుగాడు.. టెస్టుల్లో తుస్సుగాడు.. కావాలంటే ఈ లెక్కలు చూడండి!

వన్డేలు వేరు, టెస్టులు వేరు, టీ20లు వేరు..! అవును.. ఆ మూడు వేరని మాకు తెలుసు.. ఇది నువ్వు చెప్పాలా అనీ మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు..! కానీ ఈ మేటర్‌ తెలుసుకోవాల్సిందీ మీరు, నేను కాదు.. మన యువసంచలనం శుభమన్‌గిల్(Shubman Gill) గారు..! వన్డేల్లో వీరవీహారంతో రికార్డు మీటర్లను బద్దలు కొడుతున్న గిల్.. టెస్టుల్లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. వన్డే మైండ్‌సెట్‌తోనే టెస్టులు ఆడుతున్నాడు.. అటు టీ20లను సైతం అదే మైండ్‌తో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో రెచ్చిపోయి ఆడడం.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రెక్‌లెస్‌గా ఆడడం చాలామంది ఆటగాళ్లకు అలవాటే. ఇందులో గిల్‌ కూడా ఉన్నాడానన్న అనుమానం కలుగుతోంది. వన్డేల్లో ప్రస్తుతానికైతే గిల్‌ టాప్‌ ప్లేయర్‌.. ఇందులో ఏ డౌటూ లేదు. మరి టెస్టుల సంగతేంటి? క్రికెట్‌లో టెస్టులే అల్టిమేట్‌ ఫార్మెట్‌ కదా.. అందులో ఆడితేనే అసలుసిసలైన బ్యాటర్‌ అన్నట్టు. ఈ విషయం తెలియకో.. లేకపోతే తెలిసినా చేతకాకో శుభమన్‌గిల్‌ టెస్టుల్లో వరుస పెట్టి విఫలవమతున్నాడు.

కేవలం రెండు పరుగులే:
సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శుభమన్‌ గిల్‌ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాడు. 12 బంతులాడి కేవలం 2 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. టెస్టుల్లో వన్‌-డౌన్‌(ఒక వికెట్ తర్వాత బ్యాటింగ్‌ చేసే పొజిషన్‌)కు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది. గతంలో ఈ పొజిషన్‌లో గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా రాహుల్‌ ద్రవిడ్‌ అదరగొట్టాడు.. ఆ తర్వాత పుజారా కూడా రాణించాడు. మరి ఈ ఇద్దరి స్థానాన్ని భర్తీ చేయాల్సిన గిల్‌ మాత్రం ఆ లెవల్‌కు రీచ్‌ అవుతాడా అంటే ఇప్పటికైతే చెప్పడం కష్టమే. ఎందుకంటే గత ఆరు ఇన్నింగ్స్‌లో గిల్‌ గణాంకాలు చూస్తే అతని టెస్టు సామర్థ్యంపై సందేహం కలుగుతుంది. గత ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లో గిల్‌ హయ్యస్ట్ స్కోరు 29. ఇక లాస్ట్‌ సిక్స్‌ ఇన్నింగ్స్‌ రన్స్‌ చూస్తే 13,18,6,10,29*,2గా ఉంది. అంటే ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు.


అటు టెస్టుల్లో గిల్‌ యావరేజ్‌ కూడా 31.2గా ఉంది. అతను ఆడిన ఇన్నింగ్స్‌ల సంఖ్య 34. మరోవైపు వన్డేల్లో మాత్రం గిల్‌ ఈసారి దుమ్ములేపాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 15వందలకు పైగా పరుగులు చేశాడు. టెస్టుల్లో కేవలం 31 యావరేజ్‌ను మాత్రం కలిగి ఉన్న గిల్‌ వన్డేల్లో మాత్రం 60కు పైగా యావరేజ్‌ కలిగి ఉన్నాడు. ఇక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ పర్వలేదు. అటు తిరిగి ఇటు తిరిగి టెస్టుల్లోనే తుస్సుమంటున్నాడు.

Also Read: అంతా తూచ్‌.. పాండ్యా వస్తున్నాడట.. ఇదెక్కడి లొల్లి భయ్యా!
WATCH:

Advertisment
తాజా కథనాలు