Actress Shruti Haasan Suffering With PCOS Disease : కోలీవుడ్ (Kollywood) బ్యూటీ శృతి హాసన్ (Shruti Hassan) ఎన్నో ఏళ్లుగా ఓ భయంకరమైన సమస్యతో బాధ పడుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది. ప్రెజెంట్ తన సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న శృతి హాసన్ గత ఏడాది 'సలార్' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. త్వరలోనే 'సలార్ 2' లో నటించనున్న ఈ బ్యూటీ రీసెంట్ గానే బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకుంది. ఇక తాజాగా ఈ హీరోయిన్ తనకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది.
ఆ సమస్య వల్ల ఎన్నో కోల్పోయా...
శృతి హాసన్ పీసీఓఎస్ (PCOS) అనే సమస్యతో బాధ పడుతుందట. తనకు బ్యాడ్ పీరియడ్స్ సమస్య (Bad Periods Problem) ఉందని, ఫస్ట్ పీరియడ్ టైమ్ నుంచే అది పెద్ద పోరాటంగా మారిందని, ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే ఉన్నానని చెప్పింది. బ్యాడ్ పీరియడ్ టైం లో ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నట్లు తెలిపిన ఆమె ఈ ప్రాబ్లమ్ వల్ల చాలా కోల్పోయానని వెల్లడించింది.
ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే...
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తున్న డైరెక్టర్స్ కి నాకు పీరియడ్స్ సమస్య ఉంది, షూటింగ్ మరో రోజు పెట్టుకోండి అని చెప్పగలనా ? అందుకే ఆ బాధను భరిస్తూ పాటల సన్నివేశాల్లో డ్యాన్స్ చేస్తూ, కామెడీ సీన్స్ లో నవ్వుతూ నటిస్తున్నా అని చెప్పింది. దీంతో శృతి హాసన్ కి ఈ సమస్య ఉందని తెలిసి ఆమె ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు.కాగా ఈ సమస్య ఉన్న స్త్రీలు అధిక రక్త స్రావానికి గురవుతారు. దానివల్ల పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయట.
Also Read : జాతరలో మాస్ డ్యాన్స్ తో దుమ్ములేపిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో వైరల్!