Kiran Abbavaram : జాతరలో మాస్ డ్యాన్స్ తో దుమ్ములేపిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో వైరల్!

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం తన సొంతూరులో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్నాడు. ఆ జాతరలో ఫ్రెండ్స్ తో కలిసి మాస్ డ్యాన్స్ తో అదరగొట్టాడు. తాను ఒక హీరో అనే విషయాన్ని పక్కనపెట్టి మరీ ఓ గ్రామీణ యువకుడిలా రోడ్డుపై చిందులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

New Update
Kiran Abbavaram : జాతరలో మాస్ డ్యాన్స్ తో దుమ్ములేపిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో వైరల్!

Kiran Abbavaram Mass Dance Goes Viral : టాలీవుడ్ (Tollywood) అప్ కమింగ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఓ జాతరలో తన మాస్ డ్యాన్స్ తో దుమ్ములేపాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) అంతటా తెగ ట్రెండ్ అవుతుంది. ఆ జాతరలో తాను హీరో అనే విషయం మర్చిపోయి ఊరివాళ్లతో కలిసి కిరణ్ అబ్బవరం వేసిన డ్యాన్స్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ స్టార్ చేసి 'రాజా వారు రాణి గారు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ తో మెప్పించాడు. ఆ తర్వాత వచ్చిన 'SR కల్యాణ మండపం' సినిమాతో హీరోగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. అక్కడితో వరుస అవకాశాలు అందుకొని హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Also Read : బీచ్ లో చెత్త ఎత్తిన పూజా హెగ్డే.. వైరల్ అవుతున్న వీడియో!

గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేశాడు. ఇక రీసెంట్ గా తన ఫస్ట్ మూవీ హీరోయిన్ అయిన రహస్య (Rahasya) తో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట మార్చ్ 13 న నిశ్చితార్ధం చేసుకున్నారు. ఇక ప్రెజెంట్ కిరణ్ అబ్బవరం తన సొంతూరు రాయ్ చోట్ లో ఉన్నాడు.

జాతరలో మాస్ డ్యాన్స్...

తాజాగా అక్కడ జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్నాడు. గుడికి వెళ్లడమే కాకూండా జాతరలో ఫ్రెండ్స్ తో కలిసి మాస్ డ్యాన్స్ (Mass Dance) తో అదరగొట్టాడు. తాను ఒక హీరో అనే విషయాన్ని పక్కనపెట్టి మరీ ఓ గ్రామీణ యువకుడిలా రోడ్డుపై చిందులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ కిరణ్ అబ్బవరం మాస్ డ్యాన్స్ కి ఫిదా అవుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు