స్టార్ నటి శృతిహాసన్ ఇటీవల యాక్షన్ మూవీస్ పై ట్రెండ్ నడుస్తుండటంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ మూవీ 'సలార్'లో హీరోయిన్ గా నటించింది శృతి. అయితే ఈ మూవీ డిసెంబర్ 22న విడుదలై పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే మూవీ సెక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఈ మేరకు ‘సలార్: సీజ్ ఫైర్’ గురించి ప్రస్తావించిన నటి.. ఎలాంటి సినిమా చూడాలనేది పూర్తిగా ప్రేక్షకుల ఎంపికేనని అన్నారు. ఇటీవల వయలెన్స్ ఎక్కువగా ఉన్న చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే సినిమా ఎలా ఉంటుందో టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కేవలం సినిమాలే హింసను ప్రేరేపిస్తున్నాయనడం సరైనది కాదు. సినిమాలు, పాటలు, కొన్ని టీవీ షోలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. వాటిలో అన్నీ హింసాత్మకంగా ఉండవు. కొన్ని ఈ జోనర్‌తో సంబంధం లేకుండా కూడా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఏది చూడాలో.. ఏది వినాలో ప్రేక్షకులు ఎంపిక చేసుకోవచ్చు. అందరూ ఒకేరకమైన సినిమాలను ఇష్టపడరు. కొందరు యాక్షన్ సినిమాలను ఇష్టపడితే.. మరికొందరికి డ్రామాలు నచ్చుతాయి' అని చెప్పింది.
ఇది కూడా చదవండి : పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలి.. ఇందిరాపార్కువద్ద గ్రూప్-4 అభ్యర్థుల ధర్నా
అలాగే దావత్ అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రభాసే. మొదటి షెడ్యూల్ జరుగుతున్నప్పుడు సెట్‌లో నలుగురు ఉన్నారని చెప్పాను. కానీ తను 400 మందికి సరిపడా ఫుడ్‌ను పంపించాడు. తను చాలా కేరింగ్ పర్సన్’’ అంటూ ప్రభాస్ గురించి గొప్పగా చెప్పింది శృతి హాసన్. ఆ తర్వాత ‘సలార్’ సక్సెస్ క్రెడిట్‌ను ప్రభాస్‌తో పాటు శృతికి ఇచ్చాడు రవి. కానీ ఆ మాటకు శృతి ఒప్పుకోలేదు. ‘‘లేదు. ప్రతీది ఒక విజన్‌తోనే మొదలవుతుంది. అది ప్రశాంత్ సార్‌ది. నాకు తెలిసి ప్రభాస్ కూడా ఒప్పుకుంటాడు’’ అంటూ ‘సలార్’ సక్సెస్ క్రెడిట్ అంతా ప్రశాంత్ నీల్‌కు ఇచ్చింది శృతి.