Mamta Kulkarni : మమతాకు మహామండలేశ్వర్ హోదాపై హేమాంగి సఖి ఫైర్

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో సినీ నటి మమతాకులకర్ణి సన్యాసాన్ని స్వీకరించారు. కాగా సన్యాస దీక్ష చేపట్టిన మమతాకు మహామండలేశ్వర్‌గా పట్టాభిషేకం చేశారు. అయితే మమతా ను మహామండలేశ్వర్‌గా ప్రకటించడాన్ని మహామండలేశ్వర్‌ హేమాంగి సఖి అభ్యంతరం తెలిపారు.

New Update
Mamta Kulkarni

Mamta Kulkarni

Mamta Kulkarni : ఒకప్పుడు వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసం తీసుకున్న విషయం సంచలనంగా మారింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో మమతా సన్యాసాన్ని స్వీకరించారు. కాగా సన్యాస దీక్ష చేపట్టిన మమతాకు మహామండలేశ్వర్‌గా పట్టాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తన పేరును శ్రీమయి మమతానంద్‌ గిరిగా మార్చారు. అయితే మమతాపే మహామండలేశ్వర్‌గా ప్రకటించడాన్ని కిన్నార్‌ మహామండలేశ్వర్‌  హేమాంగి తప్పు పట్టారు. ఆమెకు ఆ హోదా పొందడానికి అర్హతా లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

కాగా మహాదేవుడు,మహాకాళి మాత ఆజ్ఞతో తను సన్యాసం తీసుకున్నట్లు మమతా ప్రకటించింది. కిన్నార్‌ అఖారా లో ఆచార్య మహామండలేశ్వర్‌ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో మమతా సన్యాసం స్వీకరించిన సంగతి తెలిసిందే.అయితే మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక కిన్నార్‌ అఖారాలో ఆమెను చేర్చుకోవడాన్ని ట్రాన్స్‌జెండర్‌ జగద్గురు కిన్నార్ మహామండలేశ్వర్ హేమాంగి సఖి తప్పు పట్టారు. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని, ఆమె గతమంతా అందరికీ తెలుసునన్నారు. డ్రగ్స్‌ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన విషయం ప్రపంచమంతా తెలుసని గుర్తు చేశారు. జైలు నుంచి విడుదలయిన తర్వాత ఇన్నా్ళ్లు విదేశాల్లో గడిపిన ఆమె సడన్‌గా ఇండియాకు తిరగి రావడం, మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించడం వెనుక ఏదో కుట్ర ఉందని హేమాంగి సఖి అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హిమాంగి డిమాండ్‌ చేశారు. ఆమెకు మహామండలేశ్వర్‌ హోదా ఇచ్చే ముందు ఆమె గత చరిత్రను తెలుసుకోవలసిన అవసరం లేదా? అసలు సనాతన ధర్మాన్ని ఎలా బతికిద్దామనుకుంటున్నారో చెప్పాలని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.  

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్

ఒకప్పుడు సినిమా నటిగా చేసి, ఆ తర్వాత డ్రగ్స్‌ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఆమెకు మహామండలేశ్వర్‌గా నియమింపబడే అర్హత లేదని.. ఆమెను ఆ హోదా ఎలా ఇస్తారని హేమాంగి సఖి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అనైతికమైందని అభిప్రాయపడ్డారు. మమతాను కిన్నార్‌ అఖారాలో చేర్చుకోవడం పై తను పోరాడుతానని  స్పష్టం చేశారు. అఖారాలో చర్చించకుండానే ఆమెను చేర్చుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇది కూడా చూడండి: USA:  స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..

 మమతా కులకర్ణి 90వ దశకంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.1991లో నాన్బరల్‌ అనే తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. క‌ర‌ణ్ అర్జున్, క్రాంతివీర్, సబ్‌సే బడా ఖిలాడి, కిస్మత్‌, నజీబ్ సూప‌ర్ హిట్ కావ‌డంతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ప్రేమ శిఖ‌రంతో పాటు మోహ‌న్ బాబు హీరోగా వ‌చ్చిన దొంగా పోలీస్ చిత్రంలో న‌టించింది. అగ్రతారగా వెలుగొందుతున్న సమయంలోనే  2016లో రూ.2వేలకోట్ల డ్రగ్స్‌ కేసులో ఇరుక్కుంది. కెన్యాలోని అంతర్జాతీయ డ్రగ్ రింగ్‌లో జరిగిన సమావేశానికి కులకర్ణి తన భాగస్వామి విక్కీ గోస్వామి, ఇతర సహ నిందితులతో కలిసి హాజరయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు గతేడాది వరకు సాగింది. ఈ కేసులో బాంబే హైకోర్టు సుదీర్ఘంగా విచారించిన అనంతరం క్లీన్‌ చీట్‌ ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు