Gold Price Updates: షాకిస్తున్న బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు తులం ఎంతంటే?

బంగారం ధర పెరిగింది. శుక్రవారం నిలకడగా ఉన్న పసిడి ధరలు..శనివారం ఎగబాకాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 250 వరకు పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పై రూ. 230 వరకు పెరిగింది.

New Update
Gold Price Updates: షాకిస్తున్న బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు తులం ఎంతంటే?

దేశీయ మార్కెట్లో గతకొన్నాళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు కూడా స్వల్పంగా పెరిగింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలో ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.

ఈరోజు హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58, 200ఉండగా..24క్యారెట్ల పసిడి ధర రూ. 63,190గా ఉంది. నిన్నటి ధరలతో పోల్చినట్లయితే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ.260 పెరిగింది. ఇవే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో కూడా ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నేడు ఒక గ్రాము 22క్యారెట్ల బంగారం ధర రూ. 5875 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ. 6,409గా ఉంది. ఈ లెక్కన పది గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58,750, రూ. 64,090గా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు పసిడి ధరలు వరుసగా రూ. 150, రూ. 540 పెరిగినట్లు స్పష్టం అవుతుంది.

తెలుగు రాష్ట్రాల మాదిరిగానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుతన్నాయి. ఈరోజు ఒక గ్రాము 22క్యారెట్ల బంగారం రూ. 5,835 ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 6,364గా ఉంది. ఈ లెక్కన పది గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 58,350, రూ. 63,640గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికొస్తే..వెండి ధరలు కూడా గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ నేడు మాత్రం ఒక కిలో వెండి మీద రూ. 500 తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో వెండి ధరలు ఈరోజు కొంత తగ్గాయి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఢిల్లీలో లాగా బేసి, సరి రూల్?

Advertisment
తాజా కథనాలు