Chiranjeevi : మెగాస్టార్ ను కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్.. ఫోటోలు వైరల్!

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ తాజాగా మెగాస్టార్ చిరంజీవిని తాజాగా కలిశారు. 'విశ్వంభర' మూవీ సెట్స్ లో వీరి కలయిక జరిగింది. ఈ సందర్భంగా చిరు.. మంత్రి దుర్గేష్‌తో కాసేపు ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను చిరు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

New Update
Chiranjeevi : మెగాస్టార్ ను కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్.. ఫోటోలు వైరల్!

AP Cinematography Minister Meets Megastar Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ తాజాగా మెగాస్టార్ చిరంజీవిని తాజాగా కలిశారు. హైదరాబాద్ లోని 'విశ్వంభర' మూవీ సెట్స్ లో వీరి కలయిక జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన్ని శాలువా కప్పి, పుష్ప గుచ్చంతో ఆహ్వానం పలికారు. కీరవాణి, దర్శకుడు వశిష్ట, నిర్మాతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు.. మంత్రి దుర్గేష్‌తో కాసేపు ముచ్చటించారు. కాగా చిరంజీవి ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.

" మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు..

Also Read : ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన బాలీవుడ్ హీరో.. ఖరీదు అన్ని కోట్లా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను" అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు