IT layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్.. గంటకు 23 మంది ఔట్..!!

ఐటీ ఉద్యోగులకు ప్రతిరోజూ ఓ గండంలా గడుస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఎప్పుడు ఊడుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. తెల్లవారితే ఉద్యోగం ఉంది...హమ్మయ్య అని అనుకునే పరిస్థితి నెలకొంది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొ్ంటున్న క్రమంలో బడా, చోటా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ప్రాజెక్టులు తక్కువగా రావడం...కొత్త ప్రాజెక్టులపై ఆశలు లేకపోవడం వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిగంటకు ప్రపంచవ్యాప్తంగా 23మంది ఐటీ ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఐటీ కంపెనీలకు ఏ చిన్న విషయం కనిపించినా..ఉద్యోగులకే కాకకుండా దేశఆర్ధిక వ్యవస్థకు పెద్ద సవాల్ గా మారుతోంది. గంటకు 23మంది ఉద్యోగులు అంటే..మామూలు విషయం కాదు. 24గంటల్లో 552 మంది..అంటే నెలకు 30నరోజుల్లో 16వేల 560మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు.

Layoffs: మస్తు పనిచేసిండ్రు..ఇక ఇంటికి పోండి..ఐటీ కంపెనీ నిర్ణయం..!
New Update

ఐటీ ఉద్యోగులకు ప్రతిరోజూ ఓ గండంలా గడుస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఎప్పుడు ఊడుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. తెల్లవారితే ఉద్యోగం ఉంది...హమ్మయ్య అని అనుకునే పరిస్థితి నెలకొంది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న క్రమంలో బడా, చోటా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ప్రాజెక్టులు తక్కువగా రావడం...కొత్త ప్రాజెక్టులపై ఆశలు లేకపోవడం వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రతిగంటకు ప్రపంచవ్యాప్తంగా 23మంది ఐటీ ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఐటీ కంపెనీలకు ఏ చిన్న విషయం కనిపించినా..ఉద్యోగులకే కాకకుండా దేశఆర్ధిక వ్యవస్థకు పెద్ద సవాల్ గా మారుతోంది. గంటకు 23మంది ఉద్యోగులు అంటే..మామూలు విషయం కాదు. 24గంటల్లో 552 మంది..అంటే నెలకు 30నరోజుల్లో 16వేల 560మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. గత రెండేళ్లుగా సాగుతుందని ఓ సర్వే ఈ విషయాన్ని బయట పెట్టింది.

ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో రామోజీరావుకు బిగ్ షాక్…కేసు నమోదు చేసిన సీఐడీ..!!

కాగా ఆర్ధిక మాంధ్యం పేరుతో దిగ్గజ ఐటీ సంస్థలు, స్టార్టప్ లు ఇతర టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ ప్రక్రియఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చాలా కంపెనీల్లో తొలగింపులుఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. టెక్ సెక్టార్ ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే వెబ్ సైట్ ప్రకారం 2వేల 120టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 4లక్షల మంది ఉద్యోగులను తొలగించిందని పేర్కొంది.

2022లో 1లక్షా 64వేల మంది ఉద్యోగులను తొలగించగా 2023లో 59 కంపెనీలు 2లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. అంటే రెండేళ్లలో రోజుకు 555 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ లెక్కన ప్రతి గంటకు 23 మంది ఉద్యోగులతో సమానం. 2023 జనవరిలో 89వేల మంది ఉద్యోగులను తొలగించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సంఖ్య ప్రస్తుతంతో పోలిస్తే తగ్గినప్పటికీ...తొలగింపులు మాత్రం ఆగడం లేదు.

ఇది కూడా చదవండి: ఫేస్‌బుక్‌లో యాడ్ల కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు.. బీజేపీ, కాంగ్రెస్‌ ఖర్చుల లెక్క తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఇక ఐటీ సెక్టార్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం...రిటైల్ టెక్ అండ్ కన్స్యూమర్ టెక్ ఈ సంవత్సరం భారీ మొత్తంలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఈ కంపెనీలను వరుసగా 29వేల మంది ఉద్యోగులు గత 2ఏళ్లలో ఉద్యోగులను తీసివేస్తున్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ఇవొక్కటే కాదు చైనాలిసిస్, ఫ్లెక్స్, సిస్కో. పై ఇన్సూరెన్స్ వంటిఅమెరికా బేస్డ్ కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో వందలాది మంది ఉద్యోగులను ఉద్యోగాల్లోంచి తొలగించాయి.

#it-layoffs #big-layoffs #it
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి