చావనైనా చస్తాను గానీ.. ఆ పని మాత్రం చేయను: శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగ వ్యాఖ్యలు స్వప్రయోజనం కోసం అర్థించడం కన్నా మరణమే మేలన్నారు బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనంతరం తనను కలవడానికి వచ్చిన మహిళా కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. By Naren Kumar 12 Dec 2023 in రాజకీయాలు ట్రెండింగ్ New Update షేర్ చేయండి Shivarajsingh Chowhan: స్వప్రయోజనం కోసం అర్థించడం కన్నా మరణమే మేలన్నారు బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనంతరం తనను కలవడానికి వచ్చిన మహిళా కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: తొలి విజయంతోనే సీఎం.. భజన్‌లాల్ కెరీర్లో ఆసక్తికర విశేషాలు నాలుగుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ వ్యవహరించగా, అధిష్టానం ఈ సారి మోహన్ యాదవ్ కు ఆ భాగ్యం కలిగించింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం గవర్నర్ మంగూభాయ్ పటేల్‌ను కలిసి తన రాజీనామా సమర్పించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త ముఖ్యమంత్రి పూర్తి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. Shivraj Singh Chauhan 💔 This betrayal from Modi Shah is bigger than anything. pic.twitter.com/UxBZppAUT4 — Amock (@Politics_2022_) December 11, 2023 ఈ క్రమంలో ఆయన నివాసానికి వచ్చిన పలువురు మహిళా మద్దతుదారులు భావోద్వేగానికి లోనయ్యారు. సీఎంగా ఆయనే కొనసాగాలంటూ కోరగా, తన కోసం తాను ఏదీ కోరుకోనని, అది తన ప్రాణం పోయినా జరగదని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టంగా చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. #bjp #shivaraj-singh-chauhan #mohan-yadav మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి