Hardik Vs Rohit: రోహిత్‌ దెబ్బకు పాండ్యా ప్యూజులౌట్.. ఇక దుకాణం సర్దుకోవాల్సిందే!

హార్దిక్‌ పాండ్యా లేని లోటును శివమ్‌దూబే తీర్చుతున్నాడంటున్నారు టీమిండియా ఫ్యాన్స్‌. కుర్రాడి కత్తికి రోహిత్‌ సానబెడుతున్నాడని.. ఇదంతా పాండ్యాకు చెక్‌ పెట్టడం కోసమేనని సరదగా చర్చించుకుటుంన్నారు. అఫ్ఘాన్‌పై టీ20సిరీస్‌లో దూబే ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్న విషయం తెలిసిందే.

Hardik Vs Rohit: రోహిత్‌ దెబ్బకు పాండ్యా ప్యూజులౌట్.. ఇక దుకాణం సర్దుకోవాల్సిందే!
New Update

Shivam Dube emerges as a potential option for Hardik Pandya: రోహిత్‌ శర్మ(Rohit Sharma) చాలా తెలవైన వాడు.. ఈ విషయం తెలుసుకోవడానికి అతని మైండ్‌లు స్టడీ చేయాల్సిన అవసరం లేదు.. పెరాల పెరాల పేజీలు తిరగెయాల్సిన పని అసలే లేదు. అతని కెప్టెన్సీ గణాంకాలు చూస్తే ఎవరైనా ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే. ఇక ఐపీఎల్‌(IPL)లో అద్భుతమైన కెప్టెన్లలో మొదటి స్థానంలో ఉండే రోహిత్‌ శర్మను అనూహ్యంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది ముంబై. 2024 ఐపీఎల్‌ సీజన్‌కు గుజరాత్‌ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya)కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ ముంబై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌ జరగగా.. ఇందులో మొదటి రెండు మ్యాచ్‌ల్లో శివమ్‌ దూబే(Shivam Dube) రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో పాండ్యాకు చెక్‌ పడిందానన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

publive-image శివమ్ దూబేతో రోహిత్

పాండ్యా.. ప్చ్‌.. దూబే బెస్ట్:

టీమిండియా జట్టులోకి ఆల్‌రౌండర్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్‌ పాండ్యా తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగాడు. అయితే గాయాలబారిన పడడం, ఫిటనెస్‌ సమస్యలతో బాధపడడం కారణంగా ఇటీవల కాలంలో ఎక్కువ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో గాయపడ్డ తర్వాత పాండ్యా మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టలేదు. అటు బౌలింగ్‌ వేయడం కూడా అంతకముందులాగా వేయడం లేదు. అతని బంతుల్లో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మిస్‌ అవుతోంది. కేవలం బ్యాటర్‌గానే ఎక్కువగా యూజ్‌ అవుతున్నాడు. ఇలాంటి సమయంలో శివమ్‌ దూబేని స్వయంగా కెప్టెన్‌ రోహిత్‌ ఆల్‌రౌండర్‌గా ప్రమోట్ చేస్తున్నాడు. దగ్గరుండి సలహాలు ఇచ్చి మరీ బౌలింగ్‌ వేయిస్తుండడం విశేషం.

రెండు మ్యాచ్‌ల్లో హిట్:

మొహాలి వేదికగా అఫ్ఘాన్‌పై జరిగిన తొలి టీ20లో 40 బంతుల్లో 60 రన్స్ చేశాడు శివమ్‌ దూబే. అటు బౌలింగ్‌లోనూ మెరిశాడు. రెండు ఓవర్లు వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లోనూ దూబే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. 32 బంతుల్లో 63 రన్స్‌ చేసి అఫ్ఘాన్‌ బౌలర్లకు చెమటలు పట్టించాడు దూబే. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అటు బౌలింగ్‌లోనూ ఒక వికెట్ తీశాడు. ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత దూబేపై రోహిత్‌ ప్రశంసలు కురిపించాడు. గ్రౌండ్‌లోనూ దూబేకు రోహిత్‌ చాలా సలహాలు ఇస్తూ కనిపించాడు. ఇదంతా పాండ్యాకు చెక్‌ పెట్టేందుకు రోహిత్‌ ఇలా దూబేని ప్రమోట్ చేస్తున్నాడని ఫ్యాన్స్‌ సరదగా సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు.

ALSO READ: మహిళల్లో ఊబకాయం ఎందుకు పెరుగుతుంది?

WATCH:

#cricket-news #hardik-pandya #cricket #rohit-sharma #india-vs-afghanistan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe