Punjab: పట్టపగలే అందరూ చూస్తుండగా శివసేన నేత పై కత్తులతో దాడి! పంజాబ్ శివసేన నేత సందీప్ థాపర్ పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.సిక్కులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వివాదాస్పద ప్రకటనలపై కోపంతో నిహాంగ్ లు అతని పై దాడికి దిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. By Bhavana 06 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Punjab: పంజాబ్ శివసేన నేత సందీప్ థాపర్ (Sandeep Thapar) పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివసేన నేత పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే లూథియానా ప్రభుత్వాసుపత్రి వెలుపల శుక్రవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రభుత్వాసుపత్రి సమీపంలోని సంవేద్నా ట్రస్టు (ఎన్జీఓ) వ్యవస్థాపకుడు రవీంద్ర అరోరా నాలుగో వర్దంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు థాపర్ అక్కడికి వచ్చారు. అది ముగిసిన వెంటనే ఆయన తన గన్‌మెన్‌తో కలిసి బయటకు వచ్చి బైక్‌పై బయలుదేరారు. థాపర్‌ను అనుసరించిన గుర్తుతెలియని నిహాంగ్ సిక్కులు ఆయనను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. నిందితులలో ఒకరు పొడవాటి కత్తి తో థాపర్ తలపై దాడికి దిగడంతో ఆయన తనను విడిచిపెట్టాలంటూ చేతులు జోడించి వేడుకున్నారు. ఈ క్రమంలో స్కూటర్ నుంచి అదుపుతప్పి కిందపడిన థాపర్‌పై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న జనం కానీ, థాపర్ తో పాటు ఉన్న గన్ మెన్ కానీ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోగా... అక్కడి నుంచి పారిపోవడం గమనార్హం . Punjab Shiv Sena leader Sandeep Thapar, a descendant of Indian freedom fighter and martyr Sukhdev, was reportedly critical after Nihangs attacked him with swords in Ludhiana Punjab. Shiv Sena has not given any reaction on this brutalitypic.twitter.com/EhP9aE4H3h — Rishi Bagree (@rishibagree) July 5, 2024 థాపర్ పై కత్తితో దాడి చేసిన తరువాత అగంతకులు థాపర్ స్కూటర్ పైనే పరారయ్యారు. వారు అక్కడ నుంచి పారిపోగా స్థానికులు.. తీవ్రంగా గాయపడిన థాపర్‌ను స్థానిక దయానంద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. ఆగంతకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు డీసీపీ జస్కిరాన్జిత్ సింగ్ తేజ వివరించారు. సిక్కులకు వ్యతిరేకంగా ఆయన చేసిన వివాదాస్పద ప్రకటనలపై కోపంతో నిహాంగ్ లు అతని పై దాడికి దిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అనంతరం శివసేన కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పంజాబ్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలతో నిరసలకు దిగారు. థాపర్‌కు ముగ్గురు గన్‌మెన్‌లతో రక్షణ ఉన్నప్పటికీ గత వారంలో ఆయన భద్రతను కుదించడం అనుమానాలకు తావిస్తోంది. BREAKING : Sandeep Thapar kin of Shaheed Sukhdev singh was attacked by 3 assailants ( Nihang) in Ludhiana town. Sandeep Thapar belongs to Hindustan shiv Sena. pic.twitter.com/nEEmrKZUhc — Baba Banaras™ (@RealBababanaras) July 5, 2024 Also read: తునిలో క్షుద్ర పూజలు కలకలం.. #attack #punjab #sivasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి