Ap Crime: తునిలో క్షుద్ర పూజలు కలకలం..

తూర్పు గోదావరి జిల్లా తునిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. క్షుద్ర పూజలు చేసి గేదె దూడని వధించిన సంచార జాతి వ్యక్తులు. పూజలు ఎందుకు చేస్తున్నారని వారిని గ్రామస్థులు ప్రశ్నించగా వారు గ్రామస్థుల పై కత్తితో దాడికి దిగారు. దీంతో గ్రామస్తులు వారికి దేహశుద్ది చేశారు.

New Update
Ap Crime: తునిలో క్షుద్ర పూజలు కలకలం..

Black Magic in Tuni: తూర్పు గోదావరి జిల్లా తునిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. క్షుద్ర పూజలు చేసి గేదె దూడని వధించిన సంచార జాతి వ్యక్తులు. పూజలు ఎందుకు చేస్తున్నారని వారిని గ్రామస్థులు ప్రశ్నించగా వారు గ్రామస్థుల పై కత్తితో దాడికి దిగారు. దీంతో గ్రామస్తులు వారికి దేహశుద్ది చేశారు. దాంతో సంచార జాతి వారు పారిపోతుండగా ఒకరిని పట్టుకున్నారు.

మిగిలిన వారు పారిపోయారు. మద్యం మత్తులో క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేసిన గ్రామస్థులు. ఆ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన తెరి మండలం లోవకొత్తూరు గ్రామంలో జరిగింది. నిన్న అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు చేసినట్లుగా గ్రామస్థులు అనుమానిస్తున్నారు. క్షుద్ర పూజలు నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్న గ్రామస్థులు. సంఘటనా స్థలంలో పూజా సామాగ్రితో పాటు.. బలి ఇచ్చిన దూడ మాంసాన్ని గుర్తించిన స్ధానికులు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Also Read: పేలిన భారీ అగ్ని పర్వతం..బూడిదమయమైన విమానాశ్రయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు