Parliament attack:మాకు నిప్పు పెట్టుకుందాం అనుకున్నాం..పార్లమెంటు దాడి ప్రధాన నిందితుడు లలిత్ ఝా పోలీసుల ఇంటరాగేషన్ లో పార్లమెంటుదాడికి రెండు, మూడు ప్లాన్లు పెట్టుకున్నామని చెప్పాడు ప్రధాన నిందితుడు అయిన లలిత్ ఝా. అందులో మొదటిది తమకు తాము నిప్పంటించుకోవడం అని తెలిపాడు. By Manogna alamuru 16 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి పార్లమెంటు దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇందులో చాలా విషయాలు బయటపడుతున్నాయి. వీరిలో ప్రధాన నిందితుడు అయిన లలిత్ ఝా నుంచి చాలా విషయాలు రాబట్టామని చెబుతున్నారు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఒక పోలీస్ ఆఫీసర్. నిప్పటించుకోవడం, కరపత్రాలు విసరడం, స్మఓక్ క్యాన్ ఇవి వారి ప్లాన్ లు అని తెలిపారు. Also read:ఒక ఆర్డర్ కు ఆరుసార్లు డెలివరీ…యూజర్ కు వింత అనుభవం తమకు తాము నిప్పంటిచుకుని పార్లమెంటులోకి దూకడం మొదటి ప్లాన్ అని లలిత్ ఝా తెలిపాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటు లోపలా, బయటా కూడా ఉన్న వ్యక్తులు తమ శరీరాలకు నిప్పంటిచుకోవాలని ప్లాన్ వేశారుట. అప్పుడు శరీరం ఎక్కువగా కాలిపోకుండా ఉండడానికి ఉపయోగించే ఫైర్ రిట్రాడెంట్ జెల్ రాసుకుని...తాము ఎక్కువ కాలిపోకుండా ఉండేలా చూసుకోవాలనుకున్నామని చెబుతున్నాడు లలిత్ ఝా. అయితే ఆ జెల్ ఎక్కువగా దొరకడం కష్టం అయింది. అందుకే ఆ ప్లాన్ నుంచి డ్రాప్ అయ్యామని చెప్పాడు. దాని తరువాత ప్లాన్ కరపత్రాలను విసరడం. కానీ అదికూడా వద్దనుకున్నాము. చివరకు స్మోక్ క్యాన్ లను విసరాలని డిసైడ్ అయ్యామని...దాన్నే అమలుపరిచామని చేశారని నోలీస్ అధికారి తెలిపారు. ఇక దర్యాప్తులో భాగంగా నిందితులను కుట్రకు ప్లాన్ చేసిన ప్రాంతాలకు తీసుకెళ్ళనున్నారు. లలిత్ ఝాను రాజస్థాన్ లోని నాగౌర్‌కు తీసుకెళ్ళనున్నారు. అక్కడే అతను తన ఫోన్ ను పారేసి...ఇతరుల ఫోన్లను కాల్చేశాడు. అంతేకాదు పార్లమెంటులోకి కూడా తీసుకెళ్ళి సీన్ రిక్రేయట్ చేయనున్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో లలిత్ చాలాసార్లు మాటలు మార్చాడని చెబుతున్నారు పోలీసులు. ఇతనిని మాస్టర్జీ అని కూడా పిలుస్తారని అంటున్నారు. లలిత్ కోలకత్తాలో పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడని అందుకే మాస్టర్జీ అంటారని చెప్పాడు. #attack #india #parliamnet #lalt-jha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి