Nalgonda:పోలీసుల ప్రాణాలమీదకొచ్చిన గొర్రెల పంచాయితీ..ఎస్‌ఐపై దాడి!

గొర్రెల కొనుగోలు పంచాయితీ పోలీసుల ప్రాణాలమీదకొచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణకు వెళ్లిన నల్గొండ జిల్లా చెన్నంపేట ఎస్‌ఐ సతీష్‌తోపాటు సిబ్బందిపై వెఎస్ ఆర్ జిల్లా చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివ గ్యాంగ్ దాడికి పాల్పడ్డారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది.

Nalgonda:పోలీసుల ప్రాణాలమీదకొచ్చిన గొర్రెల పంచాయితీ..ఎస్‌ఐపై దాడి!
New Update

Kadapa: గొర్రెల కొనుగోలు విషయంలో మొదలైన గొడవ పోలీసుల ప్రాణాలమీదకొచ్చింది. మూగజీవాలను కొన్న వ్యక్తులు డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులు కంప్లైట్ ఇచ్చారు. దీంతో వారికి న్యాయం చేసేందుకు వెళ్లిన రక్షక భటులపై పలువురు వ్యక్తులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

రూ.30 లక్షల వాయిదా..
ఈ మేరకు పోలీసు అధికారులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు పురపాలికలోని చిన్నయ్యగారిపల్లెకు చెందిన ఓబుగాని శివతోపాటు మరికొందరు వ్యక్తులు నల్గొండ జిల్లా రైతుల దగ్గర గొర్రెలను కొనుగోలు చేశారు. అయితే కొంతమొత్తానికి ఒప్పదం కుదరగా ఇందులో రూ.30 లక్షల వరకూ వాయిదా పెట్టారు. దీంతో తమ డబ్బులు ఇవ్వాలని అడిగేందుకు వెళ్లిన బాధితులపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధితులు పదిరోజుల క్రితం చెన్నంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Red Sandalwood : మరోసారి రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు.. కానిస్టేబుల్‌పై దారుణం

ఎస్‌ఐతో పాటు సిబ్బందిపై దాడి..
అయితే బాధితులకు న్యాయం చేసేందుకు నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ సతీష్‌తోపాటు సిబ్బంది గురువారం రాత్రి చిన్నయ్యగారిపల్లెకు వెళ్లారు. డబ్బులు ఇచ్చే విషయంలో అక్కడ గ్రామస్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యక్తిగత దూషణలకు దారితీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన శివతోపాటు మరో పది మంది ఎస్‌ఐ, ఇతర సిబ్బందితోపాటు డ్రైవరుపై దాడికి పాల్పడ్డారు. వారిని తీవ్రంగా గాయపరిచి పోలీసు వాహనం అద్దాలను పగలగొట్టి నానా హంగామా చేశారని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు మైదుకూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందుతులకు సమన్లు జారీ చేసినట్లు ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు. వారందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్ట్ చేసి పూర్తి విచారణ చేపడతామన్నారు.

#kadapa-district #nalgonda #sheep-sale-and-purchase #attack-on-police
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe