/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T123019.665.jpg)
Manamey : శ్రీరామ్ ఆదిత్య (Sri Ram Aditya) దర్శకత్వంలో హీరో శర్వానంద్ (Sharwanand) లేటెస్ట్ ఫిల్మ్ మనమే (Maname). పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఫీమేల్ లీడ్ లో నటించగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
'మనమే' ట్రైలర్
ట్రైలర్ చూస్తుంటే సినిమా కథంతా ఓ పిల్లవాడి చుట్టూ తిరుగుతూ ఉంటుందని తెలుస్తోంది. కృతి శెట్టి (Kriti Shetty), శర్వానంద్ కలిసి ఒక పిల్లవాడిని పెంచడం. ఈ క్రమంలో వాళ్ళు పడే కష్టాలను ట్రైలర్ లో ఎంటటైనింగ్ గా చూపించారు. అసలు ఆ బాబు ఎవరు..? బాబుకు హీరో, హీరోయిన్ కు సంబంధం ఏంటి అనే సస్పెన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ తెలియజేశారు.
#ManameyTrailer looks Funtastic and Fun. Best wishes to my dearest @ImSharwanand 🤗
Good luck to the entire team of #Manamey 👍🏻
Looking forward to the film on June 7th!@IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @HeshamAWMusic @IamSeeratKapoor… pic.twitter.com/CoIrZUiE3E
— Ram Charan (@AlwaysRamCharan) June 1, 2024