Movies:బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ బర్త్ డే టుడే సినిమా ఫీల్డ్‌లో చాలా మంది హీరోలు ఉంటారు. కానీ మొత్తం ఇండస్ట్రీకే ఒకరు హీరోగా వెలగుతారు. గత కొన్నేళ్ళుగా బాలీవుడ్‌కు బాద్షా మాత్రం ఒక్కడే. ఏన్నేళ్ళయినా తనకు తిరుగులేదు అని నిరూపించుకుంటున్న కింగ్ ఖాన్ బర్త్ డే టుడే. By Manogna alamuru 02 Nov 2023 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ముందుంటారు. తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగాడు ఈ కింగ్ ఖాన్. బాలీవుడ్ లో అమితాబ్ హవా నడుస్తున్న టైమ్ లో.. ఇండస్ట్రీ అంతా ఆయన చుట్టూనే తిరుగుతున్న సమయంలో ఎంతోమంది హీరోలు లైన్ లోకి వచ్చారు. సినిమాలు చేశారు. అంతో ఇంతో స్టార్ డమ్ సంపాదించారు.. కాని బాలీవుడ్ ను ఏలేంత స్టార్ డమ్ మాత్రం ఒక్కడికే వచ్చింది. షారూఖ్ తో పాటూ కొంతమంది హీరోలు బాలీవుడ్ కు పిల్లర్లుగా నిలబడ్డా... వాళ్ళల్లో బాలీవుడ్ ని ఏలింది మాత్రం షారుఖ్ ఒక్కడే. తన సినిమాల సక్సెస్ రికార్డులతో బాలీవుడ్ బాద్ షా అనిపించుకున్నాడు షారుఖ్. ప్రతీహీరోకి తన కెరీర్ లో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. అలాగే షారూఖ్ జీవితంలో కూడా ఎన్నో కష్ట నష్టాలున్నాయి. బాలీవుడ్ హవా నడుస్తున్నప్పుడు కింగ్ ఖాన్ సడెన్ గా పడిపోయాడు. వరుసగా సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దానికి తోడు కొడుకు డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు. దాంతో నాలుగేళ్ళు ఇంటికే పరిమితం అయిపోయాడు బాద్షా. కానీ కట్ చేస్తే...ఎంత కిందకు పడిపోయాడో అంతకంటే పదింతలు పైకి ఎగిరాడు. టాలీవుడ్ సినిమాలకు కుదేలయిన బాలీవుడ్‌ని ఒంటి చేత్తో పైకి లేపి నిలబెట్టాడు. దటీజ్ కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు. వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్ దుమ్ము రేగ్గొట్టి....డాన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. పఠాన్, జవాన్ సినిమాల సూపర్ డూపర్ హిట్ తో ఫుల్ జోష్ మీదున్నాడు షారూఖ్ ఇప్పుడు. Also read:మేడిగడ్డ బ్యారేజిని సందర్శించిన రాహుల్ షారుఖ్ ఖాన్ కు ఈ స్టార్ డమ్ వారసత్వంగా రాలేదు. పుట్టుకతోనే ఆయన గోల్డెన్ స్పూన్ కాదు. ముంబయ్ లోనే అత్యంత విలాసవంతమైన భవంతి మన్నత్ లో నివసిస్తున్నాడు షారుఖ్.. ఆయన ఇంటి నేమ్ బోర్డ్ కోసమే 30 లక్షల వరకూ పెట్టాడు.. కాని ఆయన పుట్టుకతోనే ధనవంతుడు కాదు.. హీరోగా నిలబడటం కోసం సినిమా కష్టాలెన్నో పడ్డాడు షారుఖ్ ఖాన్. పుట్టింది ఢిల్లీలో అయినా.. సినిమాల కోసం ముంబయ్ చేరాడు.. చేతిలో డబ్బులు లేక రోడ్లమీద తిరిగాడు.. ఎన్నోరోజులు నీళ్ళు తాగి కడుపు నింపకున్నాడు.1992లో వచ్చిన దీవానా సినిమాలో ఫుల్ లెంగ్త్ సపోర్టింగ్ రోల్ చేసి వెండితెరపై కనిపించి షారుఖ్.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , సెకండ్ హీరోగాకొన్నిసినిమాలు చేశాడు. 1993 లో వచ్చిన బాజీగర్, డర్ సినిమాల్లో విలన్ గా చేసిన షారుఖ్.. ఈ సినిమాతో తనలో నటను అందరికి తెలిసేలా చేశాడు. కాని ఈసినిమాతో ఆయనకు అన్నీ విలన్ పాత్రలే వచ్చాయి. హీరో అవ్వాలి అన్నది తన టార్గెట్ కాగా.. విలన్ రోల్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చాడు షాకుఖ్ ఖాన్. కాని షారుక్ కు మళ్లీ సెకండ్ హీరో పాత్రలే వచ్చాయి కాని.. మెయిన్ హీరోగా మాత్రం అవకాశాలు రాలేదు.. అయితే 1995లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్, కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే సినిమా షారుఖ్ జీవితాన్ని మార్చేసింది. ఈ ఒక్క సినిమాతో కోట్లమంది అభిమానులను ఒకేసారి సంపాదించాడు షారుఖ్. ఈసినిమాతో అమ్మాయిలు ఆయనంటే పడి చచ్చిపోయారు..ఒక్క బాలీవుడ్ లోనే కాదు.. దేశ మంతా ఆయన పేరు మారు మోగిపోయింది. ఇప్పటికి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది ఆ సినిమా, సాంగ్స్. దీంతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు షారుఖ్. ఆ తరువాత మాత్రం అతణ్ణి ఢీకొట్టేవాడే లేకపోయాడు ఇప్పటి వరకు. ఈసారి షారూఖ్ బర్త్ డే సందర్భంగా డంకీ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. రాజ్‌కుమార్ హీరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్లో విడుదల అవ్వాలి కానీ అదే టైమ్ లో ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అవుతుండడంతో డంకీ విడుదలను వాయిదా వేశారు. రెండు వరుస సినిమాల హిట్‌తో జోష్ మీదున్న షారూఖ్ ఈరోజు బాలీవుడ్లో పెద్ద పార్టీ ఇవ్వనున్నారు. కరణ్ జోహార్, దీపికా పడ్కోన్, అట్లీ, అలియా భట్, కాజోల్ ఇలా చాలా మందిని దీనికి ఆహ్వానించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. Coming this Christmas to comfort your hearts… A heartwarming story of friendship, love and being together. The #DunkiDrop1 is here. #Dunki releases in cinemas worldwide this Christmas 2023. pic.twitter.com/QR842sBAIz — Red Chillies Entertainment (@RedChilliesEnt) November 2, 2023 #bollywood #movies #dunky #birthday #sharukh-khan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి