అభివృద్ధిపై చర్చించే దమ్ముందా?.. కేటీఆర్‌కు షర్మిల సవాల్! TS: కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు షర్మిల. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించిన దొంగలని ధ్వజమెత్తారు. ఈసారి కేసీఆర్ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు షర్మిల. By V.J Reddy 05 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఈ ఎన్నికల్లో BRS ప్రభుత్వాన్ని ఓడించడమే తమ లక్ష్యమని.. ఓట్లు చీలకుండా ఉండేందుకే తమ పార్టీ పోటీ చేయట్లేదని ప్రకటించిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila).. తమ మద్దతును కాంగ్రెస్ పార్టీకి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, షర్మిల నిర్ణయంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనీ భావించిన YSRTP నేతలకు షర్మిల నిర్ణయం కొంచం నిరాశ కలిగించిందనే చెప్పాలి. Also Read: కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి! తాజా సీఎం కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్(KTR)లపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు షర్మిల. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్‌ని వాడుకుంటున్నావా కేటీఆర్?.. అంటూ ఆమె ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ లాంటి తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరని... నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్న వెన్నుపోటుదారులని ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న బందిపోట్లని విమర్శించారు. Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్ ఆస్తులు ఎంతో తెలుసా? రాష్ట్ర విభజన జరిగే సమయానికి మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించిన దొంగలని.. కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు కాజేసిన దోపిడీదారులంటూ ఫైర్ అయ్యారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి 10 ఏళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట వ్యతిరేక శక్తులని అన్నారు. 3 ఎకరాల భూమి, ఇంటికి 10 లక్షలు అని చెప్పి దళితులను దగా చేసిన దళిత ద్రోహులు కేసీఆర్, కేటీఆర్ అని.. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాగించిన ఉద్యమం సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. నిధులు వాళ్ళ ఖాజానికి.. నీళ్లు వాళ్ల ఫామ్ హౌస్‌లకి వెళ్లాయని ఆరోపించారు. ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనుకోవడం మీ అవివేకానికి, అత్యాశకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, నియంత పాలన చేస్తున్న తాలిబన్లను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్ ని వాడుకుంటున్నావా కేటీఆర్.. మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు... నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్న వెన్నుపోటుదారులు మీరు.. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి, కుటుంబాన్ని… — YS Sharmila (@realyssharmila) November 5, 2023 #ktr #cm-kcr #telangana-election-2023 #y-s-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి