Sharad Pawar: 2014 నుంచి బీజేపీ నేతలపై ఈడీ చర్యలు లేవు: శరద్‌ పవార్

2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.

New Update
Sharad Pawar: 2014 నుంచి బీజేపీ నేతలపై ఈడీ చర్యలు లేవు: శరద్‌ పవార్

మహారాష్ట్రకు చెందిన 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ' అధ్యక్షుడు శరద్‌ పవార్‌ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఆదివారం పుణెలో ఆయన పార్టీ నిర్వహించిన ఆరోగ్య దూత్ అభియాన్ అనే కార్యక్రమానికి శరద్‌ పవర్‌ హాజరయ్యారు.

Also Read: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై సామూహిక అత్యాచారం

బీజేపీ నేతలపై విచారణలు లేవు 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్లపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005 నుంచి 2023 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 6వేల కేసులపై ఈడీ దర్యాప్తు చేసిందని అన్నారు. కేవలం 25 కేసుల్లో మాత్రమే పురోగతి కనిపించిందని తెలిపారు. 85 శాతం కేసుల్లో విపక్ష రాజకీయ నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఆ పార్టీకి చెందిన ఏ నాయకుడిపై కూడా ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేతలపై విచారణలు మొత్తానికి ఆగిపోయాయని విమర్శించారు.

ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలే

అయితే మరోవైపు NCPని చీల్చి షిండే ప్రభుత్వంలో అజిత్‌ పవర్ వర్గం చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ వర్గాన్నే ఎన్నికల సంఘం గుర్తించడం.. పార్టీ సింబల్‌ గడియారాన్ని ఆ వర్గానికి కేటాయించడంపై శరద్‌ పవార్ స్పందించారు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయానికి ప్రజలు ఎప్పటికీ మద్దతు ఇవ్వరని తెలిపారు. తన తొలి ఎన్నికల్లో రెండు ఎడ్ల గుర్తుపై పోటీ చేసినట్లు చెప్పారు. ఎన్నికల చిహ్నం కంటే.. ఆలోచనలు, భావజాలం చాలా మఖ్యమని తెలిపారు. ఇక చివరగా.. ఈసీ కేటాయించిన కొత్త పేరు, సింబల్‌పై సోమవారం చర్చిస్తామని స్పష్టం చేశారు.

Also Read: ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చిన రైతులు.. బార్డర్లు మూసేసిన ప్రభుత్వం

Advertisment
తాజా కథనాలు