Shanmukh Jaswanth: షణ్ముక్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

డ్రగ్స్‌ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తనపై షణ్ముఖ్ వాళ్ళ అన్న సంపత్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని.. బలవంతంగా అబార్షన్ కూడా చేయించినట్లు మౌనిక పోలీసులకు తెలిపింది.

Shanmukh Jaswanth: షణ్ముక్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
New Update

Shanmukh Jaswanth Arrest: డ్రగ్స్‌ కేసులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. యూట్యూబ్‌లో అవకాశాలు ఇస్తానని చెప్పి.. షణ్ముక్‌ మోసం చేశాడని పోలీసులకు డాక్టర్ మౌనిక (Dr Monica) చెప్పింది. షణ్ముక్‌తోనే అతని అన్న సంపత్‌ (Sampath Vinay) పరిచయమయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. షణ్ముక్‌ అన్న సంపత్ వినయ్ హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఓసారి తనకు అబార్షన్ కూడా చేయించాడని పేర్కొంది.

సంపత్ వినయ్, తనకు మూడేళ్ల కిందటే ఎంగేజ్మెంట్‌ జరిగిందని తెలిపింది. రెండు కుటుంబాలు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాయని పేర్కొంది. వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాడని తెలిసి పోలీసులను తీసుకుని సంపత్ ఫ్లాట్‌కు వెళ్లినట్లు పేర్కొంది. షణ్ముక్‌ (Shanmukh Jaswanth) కూడా సంపత్‌ ఫ్లాట్‌లోనే ఉన్నాడని.. షణ్ముక్‌, సంపత్‌ కలిసి గంజాయి కొడుతున్నారని మీడియాకు వివరించింది. వాళ్ల దగ్గర డ్రగ్స్ పిల్స్ (Drugs Pills) కూడా ఉన్నాయని చెప్పింది. కాంప్రమైజ్ అవ్వమని కానిస్టేబుల్‌ జావెద్ ఒత్తిడి చేశాడని ఆరోపించింది. నిజం బయటికి చెప్తే ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు వైరల్ చేస్తానని షణ్ముక్‌ అన్న బెదిరించాడని తెలిపింది.

Also Read: వైరల్ అవుతున్న విరాట్ కొడుకు అకాయ్ ఏఐ ఫోటోలు

#deepthi-sunaina #shanmukh-jaswanth-arrest #sampath-vinay #shanmukh-jaswanth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి