Rangareddy: శంషాబాద్‌లో విషాదం..సెఫ్టిక్‌ ట్యాంక్‌లో పడి బాబు మృతి

ఓ వివాహం వేడుకల్లో అపశృతి జరిగింది. తల్లిదండ్రులతో కలిసి వివాహానికి వచ్చిన ఓ బాలుడు సెఫ్టిక్‌ ట్యాంక్‌లో పడి మృతి చెందాడు. బాబుని విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటన శంషాబాద్‌ పరిధిలో చోటుచేసుకుంది.

New Update
Rangareddy: శంషాబాద్‌లో విషాదం..సెఫ్టిక్‌ ట్యాంక్‌లో పడి బాబు మృతి

ప్రాణం తీసిన డ్రైనేజీ

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహం వేడుకకు వచ్చి ఏడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయిన అభిజిత్‌రెడ్డి అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన బాలుడు ఫంక్షన్‌ హాల్‌ వెనుక ఉన్న సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిపోయాడు. ఏవరు గమనించకపోవడంతో ఊపిరి ఆడక మరణించాడు. బాబు కనిపించడం లేదంటూ తండ్రి శ్రీకాంత్ రెడ్డి వెతికినా..ప్రయోజనం లేకుండా పోయింది. సాయంత్రం వరకు బాబు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి శ్రీకాంత్ రెడ్డి. మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.

ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యం

సాయంత్రానికి అదే ఫంక్షన్ హాల్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో బాలుడి మృతదేహం కనిపించటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదశాత్తు బాలుడు అందులో పడి చనిపోగా మృతదేహాన్ని బయటకు తీశారు. మై ఫెయిర్ ఫంక్షన్ హాల్‌లో ఈ ఘటన జరగింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటున్న కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పంక్షన్‌ హాల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటనా స్థలానికి చేరుకోక ముందే బాలుడి మృతదేహాన్ని ఎలా ఉస్మానియా మార్చురీకి తరలిస్తారని పోలీసులతో బాలుడి కుటుంబ సభ్యుల వాగ్వాదం దిగారు. దీంతో పలువురు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.

Advertisment
తాజా కథనాలు