/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-15-3.jpg)
Shah Rukh Khan Touches Amitabh Bachchan's Feet In Anant Ambani Wedding : ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్ (Radhika Merchant) వివాహ వేడుక శుక్రవారం ఉదయం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతర్జాతీయ మీడియా మొత్తం ఇప్పుడు దీనిపై ఫోకస్ పెట్టింది. అంబానీ పెళ్ళికి బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్- జయ బచ్చన్, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) గౌరి ఖాన్, సల్మాన్ ఖాన్.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తదితరులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వేడుకలో భాగంగా తమిళ స్టార్ రజీని కాంత్‌ను చూసిన షారుఖ్ ఖాన్ పలకరిద్దామని వస్తాడు. ఇక తలైవర్‌తో పాటు ఆదిత్య ఠాక్రే, సచిన్ టెండుల్కర్‌లను కూడా పలకరిస్తాడు షారుఖ్.
Here's the video of legends in one frame#ShahRukhKhan #Rajinikanth #AmitabhBachchan #Sachin pic.twitter.com/bqvddYjGnP
— MASRUR (@masrur2srk) July 12, 2024
ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ను చూసిన కింగ్ ఖాన్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు. అనంతరం జయబచ్చన్ కనిపించగా తన దగ్గర కూడా కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు షారుఖ్. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది.
Also Read : ఆ వైసీపీ కీలక నేత వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారి భర్త సంచలన ఫిర్యాదు!