సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టక ముందే దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే గంపా గోవర్డన్‌ను బుజ్జగిస్తున్నారన్న ఆయన.. అందులో భాగంగానే కేసీఆర్ గంపా గోవర్డన్‌కు బహుమతిగా 195 కోట్ల ప్రజాధనం ఇచ్చారని ఆరోపించారు. గోదావరి జలాలను కామారెడ్డి ప్రజలు 15 సంవత్సరాల నుంచి తాగుతున్నారన్నారు. కేసీఆర్ సాగునీరు గురించి చెప్పాలని ఆడిగితే కమీషన్ల కోసం తాగునీరు గురించి చెబుతున్నారని విమర్శించారు. గోదావరి జలాలకు సంబంధించిన పైప్ లైన్లు సైతం నాసిరకంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.
కాంట్రాక్టర్ కేసీఆర్ మిత్రుడు కాబట్టే నాసిరకం పైపులు వేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే కాంట్రాక్టర్‌పై కేసు పెట్టాలని షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పైప్ లైన్‌లు వేసింది కేసీఆర్ మిత్రుడే అని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని దోపిడీ కానివ్వబోమన్న ఆయన.. దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఎంతవరకైనా పోరాడుతుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడ్డ దోపిడీని ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని సీఎంకు కామారెడ్డి ప్రజలు బుద్ది చెబుతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్‌పై కోపంతో ఉన్నారన్న ఆయన.. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తుండటం కామారెడ్డి ప్రజల అదృష్టమన్నారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌పై వారి ప్రతాపాన్ని చూపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం ఏ పథకాలు ప్రారంభించినా కమీషన్లే ఉన్నాయన్నారు. డబుల్ బెడ్ రూమ్‌లో కమీషన్లు, దళిత బంధులో కమీషన్లు, బీసీ బంధులో, మైనార్టీ బంధు ఇలా అన్నింటిలో బీఆర్‌ఎస్ నేతల కమీషన్లు ఉన్నాయని షబ్బీర్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.