Ramzan 2024: షబ్బీర్ అలీ నివాసంలో రంజాన్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముస్లింలందరికీ ముఖ్యమంత్రి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు.