Kukatpally : హైదరాబాద్(Hyderabad) నగరం నడి బొడ్డున మరో దారుణం జరిగింది. కామాంధుల చేతిలో మరో వివాహిత(Married) బలైంది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వర్క్‌షాప్ సెల్లార్‌లో గుర్తు తెలియని ఇద్దర వ్యక్తులు మహిళపై లైంగిక దాడి(Sexual Assault) చేసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. 45 ఏళ్ల వయసున్న మృతురాలికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని, ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Also Read : పెళ్లింట తీవ్ర విషాదం.. 9మంది దుర్మరణం!