Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. 9మంది దుర్మరణం! రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్లోని డుంగ్రి గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి వస్తుండగా బాధితులు ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 22 Apr 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Rajasthan : పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. పిల్లా పాపలతో కలిసి సరదాగా వివాహమహోత్సవానికి(Wedding) వెళ్తున్న కుటుంబాన్ని ట్రక్కు రూపంలో మృత్యువు బలితీసుకుంది. ఈ దారుణమైన రోడ్డు ప్రమాదం(Road Accident) రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఆదివారం సంభవించగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లికి వెళ్లి వస్తుండగా.. ఈ మేరకు పోలీసులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని డుంగ్రి గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి వస్తుండగా బాధితులు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున ఝలావాఢ్లో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 9 మందీ 16-30 ఏళ్ల మధ్య వయసులో ఉన్న పురుషులేనని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపే కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: Rains : మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు! #rajasthan #9-people-died #road-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి