Karnataka : దేవగౌడ మనువడి కేసులో దారుణ విషయాలు

సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ జేడీ(ఎస్‌)కు సంబంధించిన నేత శరణగౌడ కందూర్కర్ పార్టీ అధినేత దేవగౌడకు లేఖ రాశారు. ఈకేసు పార్టీ ప్రతిష్టకు ఇబ్బందిగా మారినందున చర్యలు తీసుకోవాలని కోరారు.

New Update
Karnataka : దేవగౌడ మనువడి కేసులో దారుణ విషయాలు

Deve Gowda : దేవగౌడ మనువడు ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ కేసు కర్నాటక లో పెద్ద దుమారమే రేపుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అతని మీద ఫిర్యాదులు నమోదయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజ్వల్ ఎంపీ ఎన్నికల్లో పాల్గొనకూడదని సుప్రీంకోర్టు(Supreme Court) కూడా ఆదేశాలు జారీ చేసింది. దానికి తోడు ఇప్పుడు అతడిని ఏకంగా ఆపార్టీ నుంచే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు జేడీ ఎస్ నేతలు. దీనికి సంబంధించి శరణ గౌడ అనే నేత పార్టీ అధినేత దేవగౌడకు లేఖ రాశారు.ప్రజ్వల్ వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఈయనతో పాటూ తాను 2023లోనే ప్రజ్వల్ ఇంకా మరికొంత మంది లైగింక ఫిర్యాదులకు సంబంధించి తాను బీజేపీ అధిష్టానానికి లేఖ రాశానని మరో బీజేపీ నేత దేవరాజగౌడ కూడా చెబుతున్నారు. రేపిస్ట్ కుటుంబంతో జతకట్టిన పార్టీ. ఇది జాతీయ స్థాయిలో మా పార్టీ ప్రతిష్టకు పెద్ద దెబ్బే’’ అని దేవరాజేగౌడ తన లేఖలో పేర్కొన్నారు. రెండోసారి పదవిని కోరుతూ, 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ జేడీ(ఎస్) ఎంపీ హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది.

కర్నాటక(Karnataka) లోని హసన ఎంపీ, ఏఈడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna). ఇతను మాజీ ప్రధాని దేవగౌడకు మనుమడు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అన్న కొడుకు. ప్రజ్వల్‌ నాన్న మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ. ప్రస్తుతం కర్నాటకలో ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇతను యువతులను ప్రలోభాలకు గురిచేసి లైంగిక వాంఛలు తీర్చుకోవడమే కాక వాటిని వీడియోలుగా కూడా తీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అసలు వ్యవహారం అంతా దాంతోనే బయటపడింది కూడా. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని, వాటిని వీడియోలు చేసుకుంటున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఏకంగా మూడు వేల వీడియోలు ఉంటాయని అంటున్నారు. 

Also Read : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు

దేశం విడిచి పారిపోయాడు..

ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్(Sex Scandal) కర్ణాటకును కుదిపేస్తోంది. ఇందులో వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. హాసన లోక్‌సభ సభ్యునిగా ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నిక చెల్లదని ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలను ఇచ్చింది. మరోవైపు లైగింక వేధింపుల ఆరోపణలు వచ్చాక ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం అతను జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

సమీప బంధువు దగ్గర నుంచే కంప్లైంట్‌

తాజాగా హెచ్డీ రేవణ్ణ, అతని కూమారుడు ప్రజ్వల్ మీద లైగింక దౌర్జన్యం కేసు నమోదు అయింది. వారికి సమీప బంధువే అయిన 47 ఏళ్ళ మహిళ ఈ ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు మేనత్త కూతురు. 2015లో ఈమెకు హెచ్డీ రేవణ్ణ తమ ఇంట్లో పని ఇప్పించారు. ఈమె కాకుండా వీరి ఇంట్లో మరో ఆరుగురు మహిళలు, యువతులు కూడా పని చేస్తున్నారు. అయితే వారి ఇంట్లో పనిలో చేరిన నాలుగు నెలల నుంచే తనపై లైంగిక దాడులు మొదలయ్యాయని బాధితురాలు చెప్పింది. భవానీ రేవణ్ణ ఇంట్లో లేని సమయంలోనే తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలు ఆరోపించారు. పళ్ళ/ ఇచ్చే సాకుతో స్టోర్‌ రూమ్‌కు పిలిచేవారని..నలుగు స్నానం చేయించాలని, ఒంటికి నూనె పెట్టి స్నానం చేయించాలని బాత్‌రూమ్‌‌కి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని వాపోయారు. అలాగే ప్రజ్వల్‌ కూడా తన కుమార్తతో ఫోన్లో అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పారు. ఆ బాధ భరించలేక తన కూతురు అతడిని బ్లాక్ చేసిందని తెలిపారు. ఆ తర్వాత తానూ పనిని విడిపెట్టి బయటకు వచ్చేశానని చెప్పారు. ఇప్పుడు వీడియోలు బయటకు రావడంతో కంప్లైంట్ చేస్తున్నాని అన్నారు.

Advertisment
తాజా కథనాలు