Sad News: అప్పులు ఇచ్చి అనంతలోకాలకు.. ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య.. ఎక్కడంటే?

గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఏకంగా ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ కుటుంబం ఓ సూసైట్ నోట్‌ రాసింది.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

ఒక కుటుంబంలో ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకుంటేనే ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకుంటాయి. కానీ ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విషాదాన్ని ఊహించగలరా?. అచ్చం అలాంటి ఘటనే గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అంతే కాదు తమ ఆత్మహత్యలకు గల కారణాన్ని ఓ సూసైడ్ నోట్‌లో రాసింది ఆ కుటుంబం. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. 'అడాజన్ అనే ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మనీష్ సోలంకి(35) , అతని భార్య రీటా(32) నివసిస్తున్నారు. ఈ దంపతులకు దిశ(7), కావ్య(5,) ఖుషాల్(3) ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభ(60) కూడా అక్కడే ఉంటున్నారు.

Also Read: ముఖేశ్‌ అంబానీకి ప్రాణహాని? రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు!

మనీష్ సోలంకి ఫర్నిచర్ వ్యాపారంతో పాటు కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. అతనికి ఆ ఆపార్ట్‌మెంట్‌లో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. అయితే చాలాకాలంగా కుటుంబంతోనే కలిసి ఉంటున్న అతడు చాలామందికి అప్పులు ఇచ్చాడు. ఇక దీపావళి పండుగ దగ్గర పడటంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అప్పులు తీసుకున్నవాళ్లని అడిగాడు. కానీ వారు ఇవ్వలేదు. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆరుగురు విషం తాగి చనిపోగా మనీష్ సోలంకి ఉరివేసుకొని చనిపోయాడు. ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌ను రాశారని' పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడించారు.

ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకున్న కొన్ని రోజుల తర్వాత వాళ్ల ఫ్లాట్ నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో పొరుగున ఉన్నవారు తలుపు తట్టినప్పటికీ ఎవరూ స్పందించకపోగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు డోర్ పగలగొట్టి చూడగా.. ఆ కుటంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు